చావు బతుకుల మధ్య బాధితురాలు.. లేడీ కానిస్టేబుళ్ల సెల్ఫీ | Selfies near Acid Attack Survivor.

Up women cop selfie at acid attack survivor

CM Yogi Adityanath, Acid Attack Survivor, Acid Attack Survivor Selfie, Uttar Pradesh Women Cop Selfie, Selfies Acid Attack Survivor, Women Cop Selfies, UP Women Cop, Cop Selfie Controversy

Uttar Pradesh Women Cops Click Selfies Near Acid Attack Survivor, Suspended. This incident occurred after CM Yogi Adityanath visit hospital.

మహిళా కానిస్టేబుళ్ల సెల్ఫీ.. తీవ్ర దుమారం

Posted: 03/25/2017 09:57 AM IST
Up women cop selfie at acid attack survivor

ఉత్తర ప్రదేశ్ లో మహిళా కానిస్టేబుళ్ల చేసిన నిర్వాకంపై తీవ్ర విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఓవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ యాసిడ్ బాధితురాలు, మరోపక్క చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.

యూపీకి చెందిన ఓ గ్యాంగ్ రేప్ బాధితురాలు 8 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతోంది. తన పిల్లలను కలిసేందుకు ఊంచహార్ కు వెళ్తున్న ఆమెపై గురువారం మరోసారి దాడి చేసి బలవంతంగా యాసిడ్ తాగించారు. చావు బ్రతుకుల మధ్య ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలిసిన సీఎం యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం స్వయంగా వెళ్లి బాధితురాలిని పరామర్శించి, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చాడు కూడా. కేసులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే సీఎం వెళ్లిపోయాక అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుళ్లు సరదాగా అక్కడ కూర్చుని సెల్ఫీలు దిగారు. దీనిపై ఆగ్రహాం చెందిన అధికారులు వారిని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. కాగా, యాసిడ్ దాడి బాధితులకు ఉద్యోగాలు కల్పించే కేఫ్ లో బాధితురాలు పనిచేస్తోంది. తాము పేదవారిమని, కానీ భార్య మీదున్న నమ్మకంతోనే కేసులో ఇంకా పోరాడుతున్నానని, ఇంతలోనే ఇలా జరిగిందని బాధితురాలి భర్త వాపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Acid Attack Survivor  Women Cop Selfie  

Other Articles

Today on Telugu Wishesh