నాయినికి కోపం వచ్చింది.. కోపంతో ఊగిపోతూ చెంప పగలకొట్టాడు | Angry Nayini Narasimha Reddy slaps Worker.

Nayini narasimha reddy slaps party worker

Telangana Home Minister, Nayini Narasimha Reddy, Nayini Slaps Worker, Angry Nayini Narasimha Reddy, Home Minister Nayini, Telangana Leaders Fight

Telangana Home Minister Nayini Narasimha Reddy slaps party worker at Goshamahal.

హోంమంత్రి నాయిని చెంప పగలకొట్టాడు

Posted: 03/25/2017 09:21 AM IST
Nayini narasimha reddy slaps party worker

తెలంగాణలో అధికార పక్షల నేతల మధ్య నెలకొంటున్న వివాదాలు మెల్లిగా బయటపడుతున్నాయి. జిల్లా రాజకీయాల లొల్లిలో భాగంగా మొన్నే మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్టేజీ మీదే కొట్టుకోవటం చూశాం. ఇక ఇప్పడు అది కాస్త నగరంలో బయటపడింది. ఏకంగా హోం మంత్రే ఈ వివాదంలో భాగస్వామి కావటం ఇక్కడ విశేషం.

గోషామహల్ లో టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సభకు హాజరైన హోంమంత్రి నాయిని ప్రసగించగా, అనంతరం మైక్ ను నందకిషోర్ వ్యాస్ అనే మరో నేతకు ఇచ్చారు. అయితే అక్కడే ఉన్న మహేందర్ అనే కార్యకర్త దాని అభ్యంతరం చెప్పాడు. వ్యాస్ కు అంత ప్రాదాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, తాము పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నామంటూ వ్యాఖ్యానించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన నాయిని ఉగ్రరూపం దాల్చాడు.

నువ్వు ఎక్క‌డెక్క‌డ పైస‌లు వ‌సూలు చేస్తున్న‌వో నాకు తెలుసు, నీ సంగ‌తి చెప్తానంటూ ఆగ్ర‌హంతో ఊగిపోతూ అతని చెంప వాయించాడు. అంత‌టితో ఆగ‌క నీ సంగ‌తి చూస్తానంటూ హెచ్చ‌రించాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మ‌హేంద‌ర్‌కు సపోర్ట్ గా కొందరు నేతలు నిలవటంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో కొందరు నేతలు స‌ముదాయించ‌డం నాయిని శాంతించటంతో గొడ‌వ చ‌ల్లారింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Home Minister  Nayini Narasimha Reddy  Slaps Worker  

Other Articles