ప్రత్యేక హోదా వద్దుగురూ.. ప్యాకేజీయే సో బెటరు yanamala clarrifies on special status in ap assembly

Yanamala clarrifies on special status in ap assembly

Special status, special package, Andhra pradesh, Chandrababu Naidu, yanamala ramakrishunudu, ap assembly, bjp, tdp, ysrcp, pawan kalyan, jana sena

Andhra pradesh minister yanamala ramakrishunudu clarrifies in ap special status, says central pacakage is the best in ap assembly.

ప్రత్యేక హోదా వద్దుగురూ.. ప్యాకేజీయే సో బెటరు

Posted: 03/23/2017 03:48 PM IST
Yanamala clarrifies on special status in ap assembly


రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది.. కొబ్బరికాయ కొట్టినట్టుగా రెండు ముక్కలు సమానాంగా కొట్టకుండా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించి.. అంధ్రకు అన్యాయం చేసిందని ఎన్నికలకు ముందు, మరోలా చెప్పాలంటే ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ ను నిందించి పబ్బం గడుపుకోవాలని యత్నించిన నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అరోపణలు గుప్పించింది. హైదరాబాద్ ను అభివృద్ది చేసినట్లుగానే నవ్యాంధ్రను కూడా అభివృద్ది చేయాలంటే తమ పార్టీనే గెలిపించాలని అన్నారు.

ఇక అటు వెంకయ్యనాయుడు, ఇటు మోడీలను వెంటబెట్టుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటూ కేంద్రంలో బీజేపి, రాష్ట్రంలో టీడీపీ రావాల్సిన అవశ్యకత వుందన్నారు. ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పించారు. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చారు. అయినా విభజన పాపం మొత్తాన్ని కాంగ్రెస్ తలపైనే నెట్టారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లలోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో కేంద్రంతో గొడవ పెట్టుకుంటే వచ్చే నిధులు కూడా రావని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక కేంద్రం అడుగులకు మడుగులు ఒత్తతూ వారు చెప్పినట్టల్లా అడుతుంది.

ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్తపాటను అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైన ప్యాకేజీని పక్కనబెట్టి .. హోదా కోసం పాటుబడదాం.. అందుకు అసెంబ్లీ తీర్మణా చేసి పంపుదా అన్న వైసీపీ డిమాండ్ ను కూడా తోసిపుచ్చింది. మీరు ఎలాగో చేయరు.. కనీసం చేసేవారితో ఎందుకు కలసిరారు అన్న వైసీపీ డిమాండ్ పై అధికార పార్టీకి చెందిన శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. ప్రత్యేక హోదా వద్దు గురూ.. ప్యాకేజీయే సో బెటరు అంటూ కొత్త రాగం అలపించి క్లారిటీ ఇచ్చారు.

హోదాపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని అన్నారు. హోదాతో పొందే లాభాలకన్నా ఎక్కువ ప్రతిఫలం ప్యాకేజీతో దక్కనుందని, విపక్షాలు రాజకీయం చేయడం కోసమే కేంద్రం క్లారిటీ ఇచ్చిన ఈ అంశాన్ని మళ్లి మళ్లీ ప్రస్తావిస్తున్నాయని ఆరోపించారు. హోదా కోసం చర్చ అనవసరమని, ఈ అంశంపై మాట్లాడేందుకు ఏమీ లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని కేంద్రం తేల్చి చెప్పిందని, అందువల్లే అంతకు మించిన సహాయాన్ని పొందేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles