రెండాకులు.. ఇక అంతే సంగతులు.. ప్రీజ్ అయిన పార్టీ..! AIADMK factions get new party names, symbols

Aiadmk factions may seek legal recourse to defreeze party symbol

tamil nadu, Sasikala, Panneerselvam, J. Jayalalithaa, AIADMK, two leaves, election symbol, RK nagar, By elections, Election commission, politics

The two warring factions in the AIADMK have expressed their plans to seek legal recourse to defreeze the party's "two leaves" symbol as ordered by the Election Commission.

రెండాకులు.. ఇక అంతే సంగతులు.. శశికళకు టోపి.. పన్నీరుకు కరెంటు పోల్

Posted: 03/23/2017 03:52 PM IST
Aiadmk factions may seek legal recourse to defreeze party symbol

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన అర్కే నగర్ ఉప ఎన్నికలలో అన్నాడీఎంకే పార్టీ గుర్తును తమకే కేటాయించాలని అ పార్టీకి చెందిన ఇరువర్గాలు ఈసీకి చెంతకు పంచాయితీని తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు చుకెదురైంది. అమ్మ అసలైన వారసులం తామంటే తామంటూ పోరాడుతున్న శశికళ, పన్నీరు సెల్వం వర్గలకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. అర్కేనగర్ ఉపఎన్నికలలో రెండాకుల ఎన్నికల గుర్తును స్థంభింపజేసింది.

ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలో అభ్యర్థులెవరైనా ‘స్వతంత్రులు’గానే, మరేదైనా గుర్తుతో పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు అన్నాడీఎంకే పార్టీ పేరును కూడా ఎవరూ వినియోగించకుండా ఈసీ నిర్ణయం తీసుకుంది. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలకు వేర్వేరు గుర్తులను కేటాయించింది. పార్టీ పేర్లను కూడా మార్చింది. దీంతో 37 ఏళ్ళ తరువాత అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం లేకుండానే ఎన్నికల బరిలోకి దిగనుంది.

శశికళ వర్గానికి ఎన్నికల గుర్తుగా టోపీ ని కేటాయించిన ఎన్నికల సంఘం పన్నీరు సెల్వం వర్గానికి విద్యుత్ స్థంబం గుర్తును కేటాయింది. ఇక శశికళ వర్గం పార్టీ పేరును ‘ఏఐఏడీఎంకే అమ్మ’గా గుర్తించింది. కాగా  పన్నీర్ సెల్వం ఇదివరకే తమ పార్టీ పేరును ‘ఏఐఏడీఎంకే పురచ్చితలైవి అమ్మ’గానూ పిలవాలని పేర్కొంది. ఏప్రిల్ 12న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఈ గుర్తులపైనే పోటీ చేయాలని ఇచ్చిన తీర్పులో తెలిపింది. ఈ ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసే రోజునే ఈ తీర్పు వెలువడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh