20,000 పేజీల నివేదిక ఎవడైనా చదువుతాడా?.. | Election Panel Freezes AIADMK Name Symbol.

Two leaves symbol frozen by election commission

Two Leaves Symbol, AIADMK Name and Symbol, Election Commission Freeze, Two Leaves Symbol Freeze, AIADMK Symbol Freeze, RK Nagar By-election Symbol, EC AIADMK Symbol

O Panneerselvam and VK Sasikala camps on Wednesday lost the chance to use the party's "two leaves" symbol and the party's abbreviated name, during the prestigious by election for the RK Nagar seat that fell vacant after the death of former chief minister J Jayalalithaa. The Election Commission has ordered that neither of the two factions can use the "two leaves" poll symbol or the party's abbreviated name, AIADMK in the election scheduled for April 12. The two parties have been given time till tomorrow morning to choose a new symbol for the by polls and tweak the party name.

ఎన్నికల సంఘం త్వరగా తేల్చేసింది

Posted: 03/23/2017 08:57 AM IST
Two leaves symbol frozen by election commission

అనుకున్నదే జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో మరో సస్పెన్స్ డ్రామాకు తెరతీయకుండా, పార్టీ సింబల్ పై ఎన్నికల ప్యానెల్ తీర్పు ఇచ్చేసింది. రెండాకుల గుర్తు తమదంటే తమదంటూ శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆరు గంటలపాటు రెండు గ్రూప్ ల వాదనలు ఈసీ పార్టీ పేరుతోపాటు, గుర్తును బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కొత్త గుర్తుతో ఆర్కే నగర్ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

జయలలిత మరణానంతం ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. అధికారం ఎలాగూ దక్కించుకోలేకపోయిన పన్నీర్ సెల్వం కనీసం గుర్తుతోనైనా సింపథీ కొట్టేద్దామని వ్యూహాలు రచించాడు. అయితే ఈసీ మాత్రం ఎవరి వాదనకు మద్ధతు ఇవ్వకుండా గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ స్పందిస్తూ.. ఈసీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని, ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించాడు.

మరోవైపు గుర్తు కేటాయించకపోవటంపై పన్నీర్ సెల్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. గట్టి ఆధారాలు సమర్పించినప్పటికీ ఈసీ ఇలా చేయటం సరికాదన్న భావన వ్యక్తం చేశాడు. అయితే ముగ్గురు సభ్యుల నేతృత్వంలోని ఈసీ బృందం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. సరిగ్గా ముందు రోజు 20,000 పేజీలతో కూడిన నివేదికలను ఇరు వర్గాలు సమర్పించాయి. దానిని చదవటం మాములు వ్యక్తులకు అయ్యే పనేనా? అందుకే అన్నాడీఎంకే పార్టీ పేరు వాడుకోకుండా కొత్త గుర్తుతో వెళ్లాల్సిందిగా సూచించాం అని తెలిపింది. గురువారం ఉదయం పది గంటలలోపు కొత్త గుర్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ నిర్ణయం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Two Leaves Symbol  Election Commission  Freeze  RK Nagar By Election  

Other Articles

Today on Telugu Wishesh