మ్యాట్రీమోనియల్ సైట్ లో మాయ లేడీ.. ఎలా బకరాలను చేసిందో తెలుసా? | Woman cheats with matrimonial sites.

Bangalore woman cheats with matrimonial sites

Bangalore Woman Cheat, Matrimonial Sites Cheating, Matrimonial Sites Cheat, Matrimonial Fake Profile, Woman Fake Profile, Bangalore Woman Matrimonial Site, Hyderabad Youth Cheat, Matrimonial Site Cheating

Bangalore Woman cheat Hyderabad youth with fake profile in matrimonial sites. Bank account freeze later arrested.

ఫేక్ ఫోటోతో యువతి ఘరానా మోసం

Posted: 03/23/2017 09:25 AM IST
Bangalore woman cheats with matrimonial sites

ఊపిరి సలపని బిజీలో మునిగిపోతున్న నేటి యువత చివరకు వైవాహిక జీవితాలను కూడా ఇంటర్నెట్ తోనే ముడిపెడుతోంది. పూర్వంలా పెళ్లి చూపులకు వెళ్లి ఆ సందడి లేకుండానే ఆన్ లైన్ లోనే అన్నీ కానిచ్చేస్తున్నారు. అందుకు వారు వాడే సంధానకర్తలే మ్యాట్రీమోనియల్ సైట్లు. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు వాటిని మోసాలకు వేదికలుగా మార్చేస్తున్నారు. రీసెంట్ గా ఇక్కడ ఓ మహిళ చేసిన నిర్వాకం తెలిస్తే ఎవరైనా కంగుతినాల్సిందే.

బెంగళూర్ కు చెందిన ఓ 26 ఏళ్ల యువతి ఫేక్ ఫోటోతో ఓ పాపులర్ మ్యాట్రీమోనియల్ సైట్ లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఫేక్ ఫోటో, తప్పుడు సమాచారంతో హైదరాబాదీ యువతినంటూ పెద్ద ఎత్తున్న స్కెచ్ వేసింది. అమ్మాయి అందంగా ఉంది, సాఫ్ట్ వేర్ జాబ్,  పైగా లక్షన్నర జీతం  దీంతో ఆటోమేటిక్ గానే అంతా ఎగబడిపోయారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు యువకులైతే ఏకంగా ప్రేమాయణం కూడా నడిపారు.

28 ఏళ్ల వ్యక్తితో తన పర్స్ పోయిందని అర్జంట్ గా 40 వేలు కావాలంటూ కోరింది. ఆ యువకుడు అలాగే ఆమె చెప్పిన ఖాతాలో జమచేశాడు. మరోసారి కూడా డబ్బు అడగటంతో అనుమానం వచ్చిన యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో మరో యువకుడు కూడా అ యువతి బాధితుడినంటూ రావటంతో ఖాకీలు కంగుతిన్నారు. దీంతో ఆ యువతి మెయింటెన్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ ను బ్లాక్ చేశారు అధికారులు. ఇంతలో మరో వ్యక్తి ఆ అకౌంట్ తనదేనని, ఆ యువతి ఎవరో తెలీదని, తనకు మాత్రం ఓ సోదరి ఉందంటూ ఓ ఫోటో చూపించారు. ఆపై ఆ యువకుడి సోదరి శ్రీలతను అదుపులోకి తీసుకుని తమశైలిలో  ప్రశ్నించిన పోలీసులకు అసలు వ్యవహారం మొత్తం పూసగుచ్చినట్లు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Matrimonial Sites  Woman Fake Profile  Arrest  

Other Articles