చేనేతకు చేయుత.. నేతన్నతో జనసేనాని pawan kalyan visits handloom weavers houses in medak

Pawan kalyan visits handloom weavers houses in medak

pawan kalyan, handloom weavers, brand ambassador, jana sena, janasena president, medak district, katama rayudu, tollywood, viral photos, oissues of weavers, dubbaka, budhan pochampally, telangana

actor turned politician jana sena president powerstar pawan kalyan visits handloom weavers houses and in medak district.

చేనేతకు చేయుత.. నేతన్నతో జనసేనాని

Posted: 03/18/2017 04:09 PM IST
Pawan kalyan visits handloom weavers houses in medak

మగ్గాల మధ్య దారం తెగుతున్నా ఇంకా వాటినే పట్టుకుని జీవనాన్ని సాగించే నేతన్నకు అండగా నిలిచేందుకు ఏ ప్రభుత్వాలు అవసరం లేదని.. ప్రభుత్వాలు బ్రాండ్ అంబాసిడర్ లను నియమించి ప్రోత్సహించాలని పిలుపునిస్తూనే నేతన్నకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచి.. చేనేతకు చేయూతను అందిస్తానని ప్రకటించి.. నిజమైన నేతగా నేతన్నలకు లీడర్ గా మారిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్.. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నారు.

అందుకనే ఈ మధ్యకాలంలో ఆయన చేనేతకు మద్దత్తుగా పంచె కట్టుతో కనిపిస్తున్నానని చెప్పారు. అందులోనూ మగ్గంపై నేసిన దుస్తులనే కడుతున్నానని.. అందరూ ఆచరిస్తే చేనేత కుటుంబాలను ఆదుకున్నట్లు ఉంటుందని చెబుతున్నారు. మొన్న ఆంధ్రలోని మగ్గాలను పరిశీలించిన పవన్.. వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మెదక్ జిల్లాలో కాటమరాయుడు షూటింగ్ సందర్భంగా కొంత తీరిక లభించగానే.. చెంతనున్న గ్రామాలకు వెళ్లి మగ్గంపై దుస్తుల తయారీని పరిశీలించారు.

ఈ సమయంలో నేతన్నల దగ్గరకి వెళ్లి మరీ.. ఎలా నేస్తారు.. ఎంత సమయం పడుతుంది.. ఎంత ఖర్చు అవుతుంది.. ఎంత ధరకు అమ్ముతున్నారు.. గిట్టుబాటు అవుతుందా లేదా.. ప్రభుత్వ సాయం ఎలా ఉంది అని ఆరా తీశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. నేతన్నతో జనసేనాని అంటూ సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ఇలా సెలబ్రిటీలు, రాజకీయ నేతలందూ నేతన్నను అదరిస్తే ఇక వారి కష్టాలు త్వరలోనే తీరపోయి.. మగ్గాలకు కొత్త అందాలు సంతరించుకుంటాయనడంలో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  handloom weavers  brand ambassador  jana sena  viral photos  

Other Articles

Today on Telugu Wishesh