వార్నీ... ఇదేం పిచ్చి... బడ్జెట్ కు కూడా అది తప్పదా? | Budget Briefcase on Jayalalithaa's Memorial.

Budget briefcase on jayalalithaa memorial

Finance Minister Jayakumar, Jayakumar Jayalalithaa, amil Nadu Budget, Tamil Nadu Budget 2017-18, Jayalalithaa's Memorial, Jayakumar Budget Briefcase, DMK Budget Briefcase

Finance Minister for Tamil Nadu Jayakumar presented the Budget for the 2017-2018 after dutifully placing briefcase at Jayalalitha memorial to symbolically acquire her blessings create controversy.

బడ్జెట్ సూట్ కేస్.. టూమచ్ బాస్....

Posted: 03/17/2017 08:03 AM IST
Budget briefcase on jayalalithaa memorial

వ్యక్తి ఆరాధ్య భావన ఎంత పీక్స్ లో ఉంటుందో తమిళనాడు రాజకీయాల ద్వారా మనకు కొత్త కాకపోయినా... బీబీసీ రాసిన ఓ ఆర్టికల్ ప్రపంచానికి తెలియజేసింది. అమ్మ బతికున్నంత కాలం సాష్టాంగ నమస్కారం చేసే వీర వీధేయులు, జైల్లో ఉన్న సమయంలో మోడ్రన్ భరతుడిలా పన్నీర్ ఫోటోతో పాలన కొనసాగించటం చూశాం. అయితే పురుచ్ఛి తలైవి చనిపోయాక శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం రాజకీయ రగడకు ఆమె సమాధే వేదిక అయ్యింది. పన్నీర్ సెల్వం మౌన దీక్ష, చిన్నమ్మ శపథం లాంటి సీన్లతో తమిళ రాజకీయాలు హైడ్రామాను తలపించాయి. 

ఇక ఇప్పుడు మరో కొత్త సంప్రదాయం పుట్టుకు రావటమే కాదు, అది తీవ్ర స్థాయి విమర్శలకు దారితీస్తోంది. గురువారం ఉదయం పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతకు ముందు ఆర్థికమంత్రి డి.జయకుమార్ తో కిలిసి నేరుగా మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అక్కడ జయలలిత సమాధిపై బడ్జెట్ సూట్‌కేసు పెట్టి అంజలి ఘటించి, అనంతరం శాసనసభకు వెళ్లి బడ్జెట్ ప్రవేశపెట్టారు.అధికారంలో ఉన్నన్ని రోజులు టాక్స్ ఫ్రీ పేరుతో జయలలిత బడ్జెట్ ను రూపొందించేలా ప్రణాళికలు రచించేదని, ప్రస్తుతం ఆమె ఆశయాలు కొనసాగేలా పథకాల రూపకల్పన ఉంటుందని మంత్రి జయకుమార్ మీడియాకు తెలిపాడు.

అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగాయి. సమాధిపై బడ్జెట్ సూట్‌కేసు పెట్టడం సభా నియమాల ఉల్లంఘనే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది ముమ్మాటికి రాజ్యంగ విరుద్ధమేనని, ఆర్థిక మంత్రి సభకు కళంకం తెచ్చారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. వీరికి మిగతా పక్షాలు కూడా జత కలవటంతో వివాదం మరింత ముదిరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Minister Jayakumar  Budget Briefcase  Jayalalithaa Memorial  

Other Articles