ఇంతకీ కూతురు ఏం చేయలేదని ఆ తండ్రి కేసు వేశాడు? | Father drags daughter to court for not graduating within Time.

Austrian father sues his daughter too long to graduate

Austrian Father Sued, Father Daughter Graduation, Father Sued Daughter, Father Drags Daughter Court, Too Long To Graduate, Father Daughter Graduation, Father Won over Daughter, Austria Father's Battle Daughter, Father Daughter Legal Battle

An Austrian Father Has Sued His Daughter For €24,000 (Rs 16 Lakhs) Because She Took Too Long To Graduate.It doesn't end here, folks! The daughter also has to shell out €8,000 (Rs. 5.6 lakhs) in legal fees.

నా కూతురు సుద్ద వేస్ట్ అంటూ ఏం చేశాడంటే...

Posted: 03/17/2017 08:38 AM IST
Austrian father sues his daughter too long to graduate

కుటుంబ సాంప్రదాయాలు, పిల్లల పోషణ, భారం ఇలాంటి సూత్రాలు మన లాంటి దేశాలకు సరిపోతాయని కానీ, ఆధునిక భావజాలాలు అధికంగా ఉన్న పాశ్చాత్య దేశాల్లో కాదు. ఓ వయసు రాగానే సొంతగా బతకాలంటూ పిల్లలను ప్రోత్సహించటం, తప్పులు చేస్తే దండించటం లాంటివి చేస్తారు. అయితే ఆస్ట్రియాలో ఓ తండ్రి మాత్రం కాస్త ముందుకు వెళ్లాడు. తన కూతురు సుద్ద దండగ అంటూ ఆమెపై పెట్టిన ఖర్చును ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు.

యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నాలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చదువుతున్న ఓ యువతి పై ఆమె తండ్రి కేసు వేశాడు. ఎనిమిది సెమిస్టర్లలో పూర్తిచేయాల్సిన ఆర్కిటెక్చర్ కోర్సును 13 సెమిస్టర్లకు కూడా ఇంకా పూర్తి చేయలేదని అందులో పేర్కొన్నాడు. చదువుపై ఆమె శ్రద్ధ పెట్టడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ, ఆమె పై పెట్టిన ఖర్చును తనకు చెల్లించేలా ఆదేశించాలని పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరాడు.

అయితే దిగువ న్యాయస్థానాలు ఆ పిటిషన్ కొట్టేసినప్పటికీ, చివరకు సుప్రీంకోర్టులో మాత్రం ఆ తండ్రి విజయం సాధించాడు. ఆమె విద్యకు చేసిన 24,000 యూరో (16 లక్షల రూపాయలు) వడ్డీతో కలిపి మరీ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదనండీ కోర్టు ఫీజుకయిన 8,000 యూరో (5.6 లక్షల రూపాయ) లు కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఇదేం కొత్త తీర్పు కాదని, గతంలో ఇలాంటివే ఆరు కేసులు నమోదయ్యాయని ఆస్ట్రియా మీడియా కథనాలు రాసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Austria  Father Sued Daughter  Not Graduating  

Other Articles