పవన్ "అనంత" ఛాయిస్ రైటా? రాంగా? | Pawan choosing Anatapur right or wrong?

Discussion on pawan assembly constituency

Janasena 2019 Elections, Pawan Kalyan Anantapur, Janasena Anantapur, Anatapur Pawan Kalyan Constituency, Pawan Strategy, Pawan Kalyan West Godavari and Anatapur, Eluru or Anantapur, Pawan Speech at Janasena 3rd Anniversary

Janasena Chief Pawan Kalyan Again Confirmed that he would be contesting from Anantapur assembly constituency in the next general elections.

పవన్ పై పొలిటికల్ స్ట్రాటజీ అప్పుడేనా?

Posted: 03/15/2017 12:28 PM IST
Discussion on pawan assembly constituency

ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్ పలు కీలక అంశాల్లో మాత్రం పెదవి విప్పకపోవటం విమర్శలకు తావిచ్చింది. ప్రభావం చూపలేకపోతున్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, అంతంత మాత్రంగానే ఉన్న వామపక్షాలు కూడా ప్రత్యేక హోదాపై గళం విప్పిన నేపథ్యంలో సభల ద్వారా ఉదృత పోరాటానికి పిలుపునిచ్చి ఆపై సైలెంట్ అయిపోయాడు జనసేనాధినేత .

అదే సమయంలో పార్టీ పెట్టి మూడేళ్లయినా పలు సమస్యలను అర్థాంతరంగా ముగించటమో లేక పరిష్కారం కాకముందే వదిలిపెట్టాడమో చేస్తూ పార్ట్ టైం పొలిటిషియన్ గా మారిపోయాడన్న వాదన కూడా కొందరు వినిపించారు. ఏది ఏమైనా కేంద్రంపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్న పవన్ లోపాయికారీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ విషయంలో మాత్రం తప్పులను ఎంచి చూపటంలో తడబడుతున్నాడన్నది స్పష్టమౌతుంది. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇదే విషయాన్ని మూడో వార్షికోత్సవం సందర్భంగా పవన్ మరోసారి స్పష్టం చేశాడు.

పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని ఒప్పుకున్న పవన్ జూన్ నుంచి పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని కొత్త చర్చకు తెరలేపాడు. అయితే తాను మాత్రం గతంలో చెప్పినట్లుగా అనంతపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశాడు. దీంతో చంద్రబాబు, జగన్ లాగే పవన్ కూడా రాయలసీమ నుంచే ప్రాతినిథ్యం వహించటం మాత్రం పక్కా
అయిపోయింది. అయితే ఉన్న 12 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి చేస్తాడన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే విశ్లేషకులు మాత్రం ఓ అంచనా వేస్తున్నారు. అనంతపుర అర్బన్ నుంచి గానీ, లేదా గుంతకల్ నుంచి గానీ పోటీ చేసే అవకాశం ఉండొచ్చని చెబుతూ, ఇందుకు కుల, వర్గ సమీకరణాలను కారణంగా చూపుతున్నారు.

అయితే గతంలో ఏలూరు నుంచి ఓటర్ గా పవన్ తన పేరు నమోదు చేసుకున్నాడు. ఎక్కువ జనాభా పైగా కులం పరంగా కూడా అత్యధిక ఓటర్లు ఉన్నారు కూడా. అలాంటప్పుడు పవన్ తప్పుడు అడుగు వేయబోతున్నాడా? అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశమూ లేకపోలేదన్నది మరో టాక్ ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan kalyan  Anantapur Constituency  2019 General Elections  

Other Articles

Today on Telugu Wishesh