కేటీఆర్ కు రాజకీయాలు వదిలేయాలంత విరక్తి ఎందుకు కలిగిందంటే.. | Why KTR Wants to Quit Politics.

Once ktr wants to quit politics

Minister KTR, KTR Politics, TRS Congress Merge KTR, KTR 2008 by-election, 2008 by-election TRS, KTR Politics Quit, IT Minister KTR, Kalvakuntla Taraka Ramarao Politics

After 2008 by-election loss KTR wants to quit politics if TRS merge with Congress.

కేటీఆర్ నోట రాజకీయ సన్యాసం మాట!

Posted: 03/13/2017 11:30 AM IST
Once ktr wants to quit politics

తెలంగాణ ఏర్పాడ్డాక సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా, అధికారం చేపట్టాక ఏకఛత్రాధిపత్యం చెలాయించటం ఎంత స్పీడ్ గా జరిగిపోయాయో.. తొలి నుంచి పలువురు విమర్శిస్తున్నట్లు కుటుంబ పాలన డామినేషన్ కూడా అంతే త్వరగా వ్యాప్తి చెందిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఆ సంగతి కాసేపు పక్కనపెడితే కేటీఆర్ క్రియాశీలక పాత్ర గురించి మాత్రం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిందే. ఐటీ మంత్రిగా, హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చి దిద్దే భాధ్యత, కీలక నిర్ణయాల దగ్గరి నుంచి ప్రతీదాంట్లోనూ కేసీఆర్ తనయుడిదే కీ రోల్. పార్టీలోకి వచ్చిన షార్ట్ టైంలోనే మిగతా వారిని డామినేట్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. అయితే ఒకానోక స్థాయిలో రాజకీయ సన్యాసం చేయాలని కేటీఆర్ సిద్ధపడ్డాడంట.

అది 2008. ఆ టైంలో పార్టీలో ఉన్న సభ్యులందరు మూకుమ్మడిగా రాజీనామా చేసి మరీ ఉపఎన్నికలకు వెళ్లారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో గులాబీ దళానికి పెద్ద దెబ్బే తగిలింది. ఆ దారుణ ఓటమి తర్వాత తాను పూర్తిగా నిరాశలో కూరుకుపోయామని కేటీఆర్ చెప్పుకొచ్చాడు. ఆ దశలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకతప్పదని అనిపించిందని, ఒక వేళ అదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించానని గుర్తు చేసుకున్నాడు.

ఉప ఎన్నికల తర్వాత నిరాశలో కూరుకుపోయిన తనకు ఓ పత్రికలో దర్శకుడు ప్రేమ్‌రాజ్ రాసిన వ్యాసం చదివాక కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. తర్వాత అతడిని కలుసుకుని మాట్లాడానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ డైరక్టర్ ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శరణం గచ్ఛామి’ చిత్రం ఆడియోను ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  IT Minister KTR  Quit Politics  

Other Articles