అది మోడీ మానియా కాదు.. ఈవీఎం ట్యాంపరింగ్.. BJP tampered with EVMs, alleges Mayawati

Bjp tampered with evms alleges mayawati asks for fresh polling by ballot papers

mayawati, EVM Tampering, EVM ringing, Assembly elections results, Assembly elections results leads, Assembly elections trends, Uttar Pradesh elections,UP elections 2017,UP polls 2017, Uttar Pradesh, BJP, Congress, Samajwadi party, bahujan samajwadi party, politics

BSP chief mayawati accused the BJP of tampering with the EVMs and demanded fresh poll with the use of ballot paper.

అది మోడీ మానియా కాదు.. ఈవీఎం ట్యాంపరింగ్..

Posted: 03/11/2017 04:07 PM IST
Bjp tampered with evms alleges mayawati asks for fresh polling by ballot papers

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో మోడీ మానియా చక్కుచెదరలేదన్ని వాదనను అమె తోసిపుచ్చారు. నిజంగానే దేశవ్యాప్తంగా మోడీ మానియా వుంటే ఢిల్లీ, బీహార్ ఎన్నికలలో అది ఎక్కడకు వెళ్లిందని నిలదీశారు. ఉత్తర్ ప్రదేశ్ లో గెలిచింది నమో మంత్రం కాదని.. ఈవీఎంల ట్యాంపరింగ్‌ అని అమె తీవ్ర అరోపణలు చేశారు. ఏ గుర్తుకు ఓటేసినా బీజేపీకే వెళ్లిందని మాయావతి ఆరోపించారు.

బీజేపీకి దమ్ముంటే బ్యాలెట్‌ పేపర్‌తో ఓటింగ్‌కు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. నమో మంత్రం, మోడీ మానియాలు నిజమని వాదిస్తున్న బీజేకి ధైర్యముంటే తన సవాలును స్వీకరించాలని అన్నారు. పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా... ఎన్నికల కమిషన్‌ను అడగాలని సూచించారు. అలాగే ఒక్క ముస్లింకు టికెట్‌​ ఇవ్వకున్నా బీజేపీ గెలుపు ఎలా సాధ్యమైందని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమ ఓట్లు ఎక్కడికి వెళ్లాయని అమె బీజేపిని నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles