మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్రమంత్రికి నోటీసులు BJP MP Babul Supriyo booked for 'outraging modesty'

Warrant against babul supriyo for not appearing in court

babul supriyo, babul supriyo chargesheet. babul supriyos fir, babul supriyo on woman modesty, kolkata police,tmc mla mohua moitra , chargesheet against babul supriyo, india news, latest news

TMC MLA Mohua Moitra had lodged the complaint at the Alipore police station, alleging that Supriyo had tried to make fun of her name by linking it to 'Mahua', a local drink, during a live TV show on January 3.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్రమంత్రికి నోటీసులు

Posted: 03/10/2017 08:35 PM IST
Warrant against babul supriyo for not appearing in court

కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు వారెంట్‌ జారీ అయింది. ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆయన కోర్టుకు గైర్హాజరు కావడంతో ఈ వారెంట్‌ జారీ అయింది. కాగా కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదుతో కోల్‌కోతా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా జనవరిలో జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహిళల మనోభావాలను కించపరిచేలా బాబుల్‌ సుప్రియో వ్యాఖ్యలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మహువా మైత్రా ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా తనపట్ల కేంద్రమంత్రి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె జనవరి 4వ తేదీన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేంద్రమంత్రిపై కేసు నమోదు చేసి అలిపోరీ కోర్టులో ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. అలాగే టీవీ చర్చ కార్యక్రమం ఫుటేజ్‌ కూడా కోర్టుకు సమర్పించారు. అయితే అంతకు ముందు దీనిపై కేంద్రమంత్రిని పోలీసులు మూడుసార్లు వివరణ కోరినా ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని సమాచారం. మరోవైపు దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ 'వాళ్లు ఏం చేసుకుంటారో అది చేసుకోనివ్వండి. దీనిపై నేను చెప్పేది ఏమీ లేదు' అని వ్యాక్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Union minister Babul Supriyo  TMC mla Mohua Moitra  warrent  complaint  

Other Articles