సోషల్ మీడియాలో మహిళా సైనికుల న్యూడ్ ఫోటోల కలకలం | Photos of naked female Marines reportedly shared on social media.

A nude photo scandal has shaken the entire marine corps

Marine Nude Photo Scandal, Military Secret Facebook Page, Nude Photo Scandal, US Military Scandal, US Female Navy Officers, US Marine Facebook, America Marine Scandal

Marines Shared Nude Photos Of Female Colleagues Via Secret Facebook Page. US Military investigating Marine nude photo scandal.

సీక్రెట్ ఫేస్ బుక్ పేజీలో నగ్న ఫోటోలు

Posted: 03/06/2017 11:06 AM IST
A nude photo scandal has shaken the entire marine corps

అమెరికా సైనిక శిబిరంలో మరో సంచలన స్కాండల్ బయటపడింది. నేవీకి సంబంధించిన ఓ ఫేస్ బుక్ పేజీ ద్వారా అందులో పని చేసే మహిళా ఉద్యోగుల న్యూడ్ ఫోటోల లీక్ కావటం కలకలం రేపుతోంది. ఉన్నత శ్రేణి మహిళా అధికారులతోపాటు, చిన్నా చితకా స్థాయి చిత్రాలు అందులో ఉన్నాయి.

సోషల్ మీడియాతోపాటు కొన్ని వెబ్ సైట్లకు కూడా ఈ ఫొటోలను ఎవరో లీక్ చేశారు. మరోవైపు మహిళా సైనికులకు జరిగిన ఈ ఘోర అవమానంపై ఉన్నతాధికారులు దర్యాప్తును ప్రారంభించారు. దీని వెనుక మిలిటరీ అధికారుల హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికా నేవీకి సంబంధించి ఓ ఫేస్ బుక్ గ్రూప్ పేజీ ఉంది. ఇందులో దాదాపు 30 వేల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూప్ లోనే ఈ ఫొటోలను వేలాదిగా అప్ లోడ్ చేశారు.

మహిళా ఉద్యోగులు ఫొటోలతో పాటు వారి పేర్లు, ర్యాంక్ తదితర వివరాలను కూడా పేర్కొన్నారు. అంతేకాదు, వీరి గురించి అభ్యంతరకర వ్యాఖ్యల కూడా చేశారు. ప్రస్తుతం ఈ ఫేస్ బుక్ పేజీని క్లోజ్ చేశారు. జరిగిన ఘటనపై అమెరికన్ నేవీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. నైతికతను, నమ్మకాన్ని దెబ్బ తీస్తూ ఎవరో తమ సిబ్బందే ఈ నీచపు పని చేసి ఉంటారని భావిస్తున్నట్లు ఓ ప్రకటనలో నేవీ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US  Marine  Female Navy Officers  Naked Photos Scandal  

Other Articles