ఓటుకు కోట్లు... సుప్రీం సీరియస్... తప్పించుకోలేడా? | Chandrababu Can't Escape In Cash For Vote Case

Cash for vote case hearings in supreme court

Cash For Vote Case, Cash For Vote Case Chandrababu Naidu, Chandrababu Naidu Supreme Vourt, SC Cash For Vote Case, Cash For Vote Scam, Cash For Vote Chandrababu Naidu, Chandrababu Naidu Alla Ramakrishna Reddy, SC Notices to Chandrababu Naidu, Chandrababu Naidu Supreme Court Notices, Cash for Vote Babu not Escape

Cash for Vote Case hearings in Supreme Court. SC Shock To AP CM Chandrababu Naidu. Issues Notice Over Allegations. Chandrababu Can't Escape In Cash For Vote Case Alla Ramakrishna Reddy represent advocate said.

ఓటుకు నోటు.. బాబు ఇక తప్పించుకోలేడు!

Posted: 03/06/2017 01:26 PM IST
Cash for vote case hearings in supreme court

తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఫ్రెష్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్ ఆధారంగా ఏపీ సీఎంకు నోటీసులు జారీ చేసింది. సోమవారం దానిని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది కూడా. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయముందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబును ప్రాసిక్యూట్ చేయాల‌ని అందులో ఆయ‌న పేర్కొన్నారు.

అయితే గతంలో ఈ కేసులో హైకోర్టులో చంద్ర‌బాబుకు ఊర‌ట ల‌భించింది. తాజాగా సుప్రీం మాత్రం ఆళ్ల వేసిన పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఓటుకు నోటు నుంచి చంద్రబాబు తప్పించుకోవడం అసాధ్యమని ఆళ్ల తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెబుతున్నాడు.

వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలంటూ చంద్రబాబుకు కోర్టు ఆదేశాలు జారీ చేయటం, కేసును కూలంకశంగా దర్యాప్తు చేస్తామని ధర్మాసనం ప్రకటించటం చూస్తుంటే క్యాష్ ఫర్ ఓట్ కేసు చాలా తీవ్రమైందని కోర్టు భావిస్తున్నట్లు స్పష్టమౌతుందని పొన్నవోలు అంటున్నాడు. ఈ కేసులో న్యాయం తమ పక్షానే ఉంటుందన్న ఆయన, అందుకు సంబంధించిన తగిన పక్కా సాక్ష్యాలను విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతామని ప్రకటించాడు.

మరోవైపు ఇప్పటిదాకా ఈ వ్యవహారంలో జోక్యం కల్పించుకోని గవర్నర్ నరసింహన్ కూడా కేసును సంబంధించిన సీక్రెట్ ఫైళ్లను తెప్పించుకోవటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ వార్త జగన్ కు సంబంధించిన ఓ పత్రికలో మాత్రమే ప్రచురితం అయ్యిందని కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సెబాస్టియన్ చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM Chandrababu Naidu  Cash for Vote Scan  Supreme Court Notices  

Other Articles