ఇతగాడి కోసం 110 సర్జరీలు... ఎందుకోసమో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది | Man spends £40000 on 110 surgeries to become Alien.

Man try to effort to become a sexless alien

Vinny Ohh, Sexless Alien, Gender less Alien, 110 Surgeries, Bizarre Surgeries, Man Alien Surgery, Vinny Ohh Interview, Vinny Ohh Surgery, Man Bizarre Surgery

In an effort to become a sexless alien, a 22-year-old American lad, Vinny Ohh has confessed to spending $50,000 on 110 surgeries. Ohh, from Los Angeles in California, made the startling confession while revealing plans to have his genitals, nipples and belly button removed.

ఒక మనిషికే 110 సర్జరీలా! ఎందుకు?

Posted: 03/04/2017 09:45 AM IST
Man try to effort to become a sexless alien

లింగ మార్పిడి సర్వసాధారణంగా మారిపోయిన ఈ రోజుల్లో... అమెరికాలోని లాస్‌ ఏంజిలెస్ ‌కు చెందిన విన్నీ ఓహ్ (22) గురించి తెలుసుకుంటే ఎవరికైనా మతి పోతుంది. ఏకంగా 100 శస్త్రచికిత్సలను ఇతగాడు చేయించుకునేందుకు రెడీ అయ్యాడు. అందుకు కారణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవటం ఖాయం. మేకప్‌ ఆర్టిస్ట్‌గా, పార్ట్‌ టైం మోడల్‌గా పనిచేసే విన్నీ తనను తాను సమ్ థింగ్ స్పెషల్ గా భావిస్తాడు. అందుకే ఓ ‘సెక్స్ లెస్ గ్రహాంతర వాసి’గా కనిపించాలని తాపత్రాయపడుతున్నాడు.

సెక్సీ ఏలియన్ గా కనిపించాలని కోరికతో ఆపరేషన్లకు సిద్ధపడ్డాడు. అందుకోసం వైద్యులను ఆశ్రయించగా వారు సుమారు 34 లక్షల రూపాయలు (50 వేల డాలర్లు) అవుతుందని చెప్పగా, అందుకు అంగీకరించాడు కూడా. శరీరానికి 35, పిరుదుల భాగానికి 5, ముక్కుకు 5, కళ్ల కింద ఒకటి, ఫేషియల్ కోసం 5, చెంపల కోసం 12, కన్ను బొమ్మల కోసం 2, పెదవుల కోసం 15 మిగతావి.. ఇలా మొత్తం 110 సర్జరీలు ఇతగాడు చేయించుకోబోతున్నాడు.

17వ ఏట నుంచే తాను స్త్రీ లేదా పురుషుడుని కాదని, ఓ గ్రహాంతర వాసిననే భావిస్తున్నాన్ననని చెబుతన్నాడు. గ్రహాంతర వాసిలా కనిపించేందుకు నల్లని (ముదురు నలుపు) కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకుంటాడు. ఒళ్లంతా గ్రహంతర వాసుల టాటూలు వేసుకుంటాడు. వెంట్రుకలకు అసాధారణ రంగులు వేసుకుంటాడు. అంతే కాకుండా తనను స్త్రీ లేదా పురుషుడిగా గుర్తించకుండా ఉండేందుకు జెంటిల్ పార్ట్స(పురుషాంగం, ఛాతి భాగాలను) పూర్తిగా తొలగించుకోవాలనుకుంటున్నాడట. దీనికి గాను కోటి రూపాయలు (1,60,000 డాలర్లు) ఖర్చు అవుతుందట. అందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే శరీరంపై ఇన్ని శస్త్రచికిత్సలు అతనిపై చెడు ప్రభావం చూపవా? అంటే... అతనికి వచ్చే ప్రమాదం ఏం లేదని వైద్యులు చెబుతున్నారు. పుర్రెకో బుద్ధి. జిహ్వకో రుచి అన్న సామెత ఇలాంటి వాళ్లను చూసినప్పుడేనేమో గుర్తొచ్చేది.

Genderless Alien Surgery

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vinny Ohh  Gender less Alien  110 Surgeries  

Other Articles