ఎస్ బీఐ షాకింగ్ నిర్ణయం.. మినిమమ్ బ్యాలెన్స్ లేదా? అయితే అంతేనంట | SBI New Rule says Keep minimum balance or pay fine.

Sbi all set to impose penalty for not maintaining minimum balance

State Bank of India, SBI Minimum Balance, State Bank of India New Rules, State Bank of India April 1 2017, SBI Charges, State Bank of India Penalty, Bank Account Minimum balance, State Bank of India Balance, State Bank of India Charges State Bank of India Fine, SBI Fine, SBI Transaction Charges

State Bank of India announces penalty for non-maintenance of minimum balance from April 1. And also slaps charges on cash deposits.

ఖాతాదారులకు ఎస్ బీఐ బిగ్ షాక్

Posted: 03/04/2017 08:23 AM IST
Sbi all set to impose penalty for not maintaining minimum balance

ప్రైవేట్ బ్యాంకులు లావాదేవీలపై విధించిన షరతులు ఖాతాదారులకు తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. క్యాష్ లెస్ అంటూ కొత్త కొత్త నిబంధనలు విధిస్తూ భారీగా వసూళ్లకు దిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఆ రూట్ లోనే ప్రయాణించేందుకు సిద్ధమైపోయాయి.

దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ) కూడా ప్రైవేటు బ్యాంకుల దారి పడుతోంది. బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తం లేకుంటే జరిమానా కట్టాల్సిందేనంటూ తాజాగా వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. మెట్రో నగరాల్లో కనీసం రూ. 5 వేలు, నగరాలు, పట్టణాల్లో(అర్బన్) రూ. 3 వేలు, సెమీ అర్బన్ ఏరియాలో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో(రూరల్) రూ.1000 ఉండాలని నిబంధనలు విధించింది. లేకుంటే ఆయా ప్రాంతాల్లో వారి ఖాతాల్లో ఉన్న సొమ్మును బట్టి జరిమానా విధిస్తామని ఎస్ బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఖాతాదారులు నెలలో మూడు కన్నా ఎక్కువ లావాదేవీలు జరిపితే రూ.50 ఛార్జీలు వసూలు చేయనున్నట్టు పేర్కొంది. అయితే ఈ నిబంధను ఇదివరకే అమలులో ఉందని, ఇప్పుడు మళ్లీ దానిని పునరుద్ధరిస్తున్నట్టు ఓ అధికారి తెలిపాడు. వినియోగదారులు చీటికిమాటికి బ్యాంకుకు రాకుండా ఉండేందుకే ఈ నిబంధన తెచ్చినట్టు వివరించారు. ఇక నెలకు పదిసార్లు ఏటీఎం నుంచి ఉచితంగా నగదు డ్రా చేసుకునే అవకాశం ఉన్నట్లు వివరించారు. సవరించిన నిబంధనలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుత నియమావళితో బ్యాంకులేవైనా బాదుడు మాత్రం కామన్ అనేలా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : State Bank of India  Penalty  Non Maintain  Minimum balance  

Other Articles