త్వరలో స్వరాష్ట్రానికి తొలిమహిళా డ్రైవర్ సరిత సేవలు minister mahender reddy assures job for first lady driver in TSRTC

Minister mahender reddy assures job for first lady driver in tsrtc

women driver saritha, minister mahendar reddy, telangana rtc, Telangana transport ministry, delhi transport corperation, Auto driver, sansthan narayanpur, Telangana

Telangana transport minister mahender reddy assures job for sarita in TSRTC, the first lady RTC driver in delhi transport corperation

త్వరలో సొంతరాష్ట్రానికి సేవలందించనున్న తొలిమహిళా డ్రైవర్

Posted: 03/03/2017 06:20 PM IST
Minister mahender reddy assures job for first lady driver in tsrtc

తన జన్మస్థలమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి చక్రాన్ని తిప్పే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ దేశంలోని మొదటి మహిళా డ్రైవర్ సరిత తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని సచివాలయంలో కలిశారు. ఆమె స్వస్థలం నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం. ఢిల్లీ ప్రభుత్వం అందించిన పిలుపుతో అక్కడికి వెళ్లి తొలి మహిళా డ్రైవరుగా సేవలందించారు. ఆమె ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన సరిత గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్స్ అచీవర్స్‌తో సహా పలు అవార్డులు అందుకున్నారు.
 
దేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ చేతుల మీదుగా సరిత విమెన్ ఆఫ్ పవర్ అవార్డును కూడా అందుకున్నారు. కాగా, తన సేవలను తన సోంత రాష్ట్రం తెలంగాణలోనే వినియోగించాలని  అసక్తిని కనబర్చడంతో పాటు ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని కోరారు. పేద కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో ఎదుగుతున్న తనకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలని కోరారు. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే అవకాశం ఇవ్వాలన్న సరిత కోరికపై మంత్రి సానుకూలంగా స్పందించారు. నిబంధనల ప్రకారం ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పోరేషన్ నుంచి రిలీవింగ్ లెటర్ తీసుకోని రావాలని.. తనకు అవకాశాం కల్పిస్తామని మంత్రి హామి ఇచ్చారు. సరితకు మాత్రమే కాదు.. స్వశక్తితో రాణిస్తున్న మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles