చిరుతను తరమిన గ్రామసింహాలు.. Dogs chase away leopard from residential area

Three dogs chase away leopard at goregaon

Dogs, Leopard, Man-animal conflict, wild animal-domestic animal conflict, Dog chase away, leopard, CCTV, Girikunj Society, goregoan, Mumbai

A pack of dogs chased a young leopard out of an apartment complex at Goregaon on Tuesday night. The feat was captured by a closed-circuit television (CCTV) camera on the premises, the forest department said.

ITEMVIDEOS: చిరుతను తరమిన గ్రామసింహాలు.. ముంబైలో గోరేగాంలో ఘటన

Posted: 03/03/2017 12:03 PM IST
Three dogs chase away leopard at goregaon

వీధి కుక్కలు ప్రజల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయని, ప్రజలపై విరుచుకుపడి గాయపరుస్తున్నాయని అరిచిన ఆ నోళ్లు.. అక్కడి సిసిటీవీ ఫూటేజీలో నిక్షిప్తమైన వీడియోను చూసి ఒక్కసారిగా మూగబోయాయి. తమ ప్రాణాలను బలిగోనేందుకు వచ్చిన వన్యజీవిని తరమిని గ్రామసింహాలను కాదు కాదు కాలనీ సింహాలను ప్రశంసిస్తున్నారు. స్టానబలం అంటే ఏమిటో ఇప్పడు చిరుతకు తెలిసివచ్చింది. అడవిలో అత్యంత వేగంగా పరిగెత్తి వన్యప్రాణులను వెంటాడి.. వేటాడి తన ఆకలిని తీర్చుకునే చిరుత.. జనారణ్యంలో మాత్రం శునకాల చేతిలో తోడముడుచుకోవాల్సి వచ్చింది. గత్యంతరం లేక చివరకు పలాయనం చిత్తగించింది.

ముంబైలోని గోరెగావ్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన సీసీ కెమేరాల్లో నమోదవటంతో వెలుగుచూసింది. ముంబయి శివారు గోరెగావ్‌, గిరికుంజ్‌, దిందోషి హౌసింగ్‌ సొసైటీలు సంజయ్‌గాంధీ నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఉన్నాయి. నగరశివారులో ఉన్న ఈ జనావాసాల్లోకి తరచూ చిరుత పులులు, ఇతర వన్యప్రాణాలు వస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో కంచెలు, రాత్రి సమయాల్లో భారీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. అయితే, కాలనీల చివరన చెత్తకుప్పల వద్ద గుమిగూడే కుక్కలను తినేందుకు తరచూ చిరుత పులులు వచ్చి వాటిని అహారంగా చేసుకుంటున్నాయి.

అదే తరహాలో మంగళవారం రాత్రి 3గంటల సమయంలో ఒక చిరుత వచ్చి ఒంటరిగా ఉన్న వీధి కుక్కపై దాడి చేసి కొద్ది దూరం లాక్కెళ్లింది. చిరుత నుంచి తప్పించుకున్న ఆ శునకం ఎదురు తిరగింది. ప్రాణరక్షణ కోసం అరవటంతో సమీపంలోని ఇతర వీధికుక్కలూ అక్కడకు చేరుకున్నాయి. అవన్నీ సమష్టిగా వెంటపడటంతో చిరుత పారిపోయింది. సీసీటీవీలో నమోదైన దృశ్యాలను అటవీశాఖ బృందం తిలకించింది. చిరుతను ఎదిరించిన కుక్కను రాఖీగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం స్థానికులు ఆ శునకాన్ని ‘టైగర్‌’గా పిలుచుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dogs  Leopard  wild animal  domestic animal conflict  CCTV  Girikunj Society  goregoan  Mumbai  

Other Articles