‘‘పాకిస్థాన్ తో లింకుందని మానసిక క్షోభ’’ జవాను తాజా వీడియో BSF 'whistleblower' Tej Bahadur Yadav cries conspiracy

Bsf constable tej bahadur yadav releases new video alleges conspiracy

tej bahadur yadav, bsf, bsf tej bahadur yadav wife, delhi high court, bsf jawan wife, bsf jawan delhi high court, tej bahadur yadav videos, bsf viral video, bsf video, india news

BSF constable Tej Bahadur Yadav, claimed that he is being mentally tortured and that his phone has been tampered with to show that he has friends in Pakistan.

ITEMVIDEOS: ‘‘పాకిస్థాన్ తో లింకుందని మానసిక క్షోభ’’ జవాను తాజా వీడియో

Posted: 03/03/2017 11:35 AM IST
Bsf constable tej bahadur yadav releases new video alleges conspiracy

దేశం కోసం అహర్నిషలు కష్టపడతూ.. కంటి నిండా కునుకు కరువై తాము సరిహద్దులో పనిచేస్తుంటే.. తమకు కడుపునిండా తిండి కూడా పట్టడం లేదని అందుకు కారణం నాణ్యత లేని బోజనాన్ని పెట్టడం లేదని గత జనవరిలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి సైనికుల దీనస్థితిని దారుణ పరిస్థితులను మీడియాకు విశ్లేషించిన బీఎస్ఎష్ జవాను తేజ్ బహదూర్ సింగ్ గత రెండు నెలలుగా మానసిక క్షోభకు గురవుతున్నాడంటూ తాజా వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సందేశంలో పెట్టి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన తేజ్‌ బహదూర్‌ మరో కలకలం సృష్టించాడు.

సైన్యం బోజనం తాలుకు వీడియోను వెలుగులోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన ఈ జవాను.. తాజాగా మరో వీడియోను విడుదల చేశాడు. అయితే, గతంలో ఫిర్యాదు చేసిన ఆయన ఈసారి పిటిషన్‌ రూపంగా ఆ వీడియో సందేశం పంపించాడు. స్వరాజ్‌ సమాచార్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీలో తేజ్‌ బహదూర్‌ తాజా వీడియోను పబ్లిష్‌ చేశాడు. తన మొబైల్‌ ఫోన్‌ను పై అధికారులు స్వాధీనం చేసుకున్నారని, పగులగొట్టారని, మానసికంగా హింసిస్తున్నారని తాజా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

‘నేను నా ఫోన్‌ను తప్పుగా ఉపయోగించానని చెబుతున్నారని నాకు తెలిసింది. నేను ప్రధాని దృష్టికి ఆహార సమస్యను, నాణ్యత విషయాన్ని తీసుకెళ్లాలనుకున్న మాట వాస్తవం. అది నిజమైన సమస్య. అందుకు ఇప్పుడు నన్ను మానసికంగా హింసిస్తున్నారు. దేశంలో అవినీతి అంతం చేయాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. నేను నా శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టాలని అనుకుంటున్నాను. నా ఫోన్‌ను ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. తనకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని నిరూపించేందుకు ఫోన్‌లో ఏవో అంశాలు జోడిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

వాస్తవానికి ఈ వీడియో ఫిబ్రవరి మూడో వారంలో రికార్డు చేసి ఉంటారని బీఎస్‌ఎఫ్‌ అధికారులు చెబుతున్నారు. అందులో ఉన్నది తేజ్‌ బహదూరేనని, అతడి వద్దకు భార్య వెళ్లినప్పుడు ఈ వీడియో రికార్డు చేసి ఉండొచ్చని, విచారణ కోసం గతంలో అతడి వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకున్నట్లు తెలిపారు. అతడి ఫేస్‌బుక్‌ పేజీలో కొంతమంది పాకిస్థాన్‌ స్నేహితులు ఉన్నట్లు గుర్తించామని, వారి ప్రభావం అతడిపైన పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles