ఫ్రీ ట్రాన్సాక్షన్ లపై ఇంకో షాక్.. ఏయే బ్యాంకులు ఎంత భారీగా వసూలు చేస్తాయంటే | Banks to levy Rs 150 after four cash tansactions.

Banks slap charges on cash transactions

Cash Transactions, Four Free Transactions, HDFC Transaction Rules, ICICI Transaction Rules, Axis Bank Transaction Rules, Free Cash Transactions, Cash Transaction Charges, Private Banks India, India Private Banks, Cashless Transactions, 150 Rupees Charges

HDFC, ICICI, Axis banks will now charge you Rs 150 after 4 free transactions a month.

ప్రైవేట్ బ్యాంకుల్లో లావాదేవీలు.. ఇక చుక్కలే

Posted: 03/02/2017 08:01 AM IST
Banks slap charges on cash transactions

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటంలో భాగంగా.. ఖాతాదారులపై కొరడా ఝళిపించేందుకు బ్యాంకులు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో లావాదేవీలపై కొన్ని బ్యాంకులు తీవ్ర ఆంక్షలు విధించాయి. నగదు ఉపసంహరణ, జమ.. ఏదైనా సరే నాలుగింటికి మించితే తర్వాత జరిపే ఒక్కో లావాదేవీకి రూ.150 దాకా వసూలు చేయనున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిక్ బ్యాంకులు ఇప్పటికే ఈ మేరకు అంతర్గత ఆదేశాలు జారీ చేశాయి. హెచ్ డీఎఫ్ సీ హోం బ్రాంచిలో నెలకు 2 లక్షల రూపాయలు వారి సేవింగ్, శాలరీ అకౌంట్ నుంచి విత్ డ్రా లేదా డిపాజిట్ చేసుకునేందుకు అనుమతించిన బ్యాంకు అంతకు మించి ట్రాన్సాక్షన్ జరిపితే ప్రతి లావాదేవీకి రూ.వెయ్యికి రూ.5 లేదా కనిష్టంగా రూ.150 వసూలు చేయనుంది. అంతకు ముందు ఇది 50,000 రూపాయలుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక నాన్ హోమ్ బ్రాంచీల్లో థర్టీ పార్టీ ద్వారా జరపుకునే లావాదేవీకి పాతిక వేల దాకా అవకాశం కల్పించారు. ఆ పరిమితి దాటితే పైన చెప్పిన ఛార్జీలే వసూలు చేయనున్నారు. మైనర్, వృద్ధ ఖాతాదారులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.

ఐసీఐసీఐ బ్యాంకు నాలుగు ఉచిత లావాదేవీలు, ఆపై ఛార్జీలు వసూలు చేస్తుండగా, నాన్ హోమ్ బ్రాంచీలకు రోజువారీ 50,000 లావాదేవీకి అనుమతి ఇచ్చింది.క్యాష్ డిపాజిట్ మెషీన్ లలో తొలి లావాదేవీకి ఫ్రీ అవకాశం ఇఛ్చి, ఆపై ఛార్జీలు వసూలు చేయనుంది.  యాక్సిక్ బ్యాంకు ఖాతాదారులు 10 లక్షల దాకా డిపాజిట్లు, విత్ డ్రా లేదా తొలి ఐదు ట్రాన్సాక్షన్ లు చేసుకునే వెసులు బాటు కల్పించి, ఆపై ఛార్జీలను బాదనుంది. 

ఇక బుధవారం నుంచే ఆయా బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను అమల్లోకి వచ్చాయి కూడా. మరోపక్క ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇటువంటి నిబంధనలు విధించే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో అలాంటిదేం ఉండకపోవచ్చనే ఓ అధికారి స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Private Banks  Cash Transactions  Charges  

Other Articles

Today on Telugu Wishesh