నో పెప్సీ.. నో కోకా-కోలా.. ఇది భారత్ అంతటా జరగాలా..! Pepsi and Coke ready for storm as Tamil Nadu's boycott begins

Tamil nadu traders ban pepsi coca cola to support local products

pepsi, coca-cola, soft drinks, cool drinks, mnc companies, local products, tamilians, multi national companies, tamil nadu, retail shops

A leading group of traders in Tamil Nadu is going 'swadeshi' by boycotting Coke and Pepsi from today (March 1) citing health and environmental reasons.

నో పెప్సీ.. నో కోకా-కోలా.. ఇది భారత్ అంతటా జరగాలా..!

Posted: 03/01/2017 03:52 PM IST
Tamil nadu traders ban pepsi coca cola to support local products

తమిళనాడులో బహుళజాతి కంపెనీలకు చెందిన శీతలపానీయాలు ఇక కనబడవు. చిన్న దుకాణాల నుంచి రిటైట్ షాపుల వరకు.. గ్రామీణ సినిమాహాళ్ల నుంచి పెద్ద మల్టీఫెక్స్ ల వరకు అన్ని చోట్ల ఇక  పెప్సీ, కోకా- కోలా శీతలపానీయాలు లభించవు. విదేశీ బ్రాండ్ల అమ్మకాలను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో వర్తకులు ఎంఎన్సీ కంపెనీల శీతలపానీయాల బహిష్కరణకు పిలుపిచ్చారు. పెప్సీ, కోకా-కోలా లాంటి బహుళజాతి కంపెనీలు తమ నీటివనరులను దోచుకుంటున్నాయని వర్తక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల దుకాణాలు తొమ్మిది వర్తక సంఘాలకు అనుబంధంగా ఉన్నాయి. ఇందులో చాలావరకు ఇవాళ్టి నుంచి విదేశీ శీతలపానీయాల విక్రయం ఆపేస్తున్నాయి. ఇది పక్కన పెడితే.. సూపర్‌ మార్కెట్లు, హోటళ్లు మాత్రం వీటిని విక్రయిస్తూనే ఉన్నాయి. క్రమంగా వాటిలోనూ ఎంఎన్సీ కంపెనీల శీతలపానీయాలకు చెక్ పెట్టేలా తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక  ప్రాంతీయంగా తయారు చేస్తున్న శీతల పానీయాల అమ్మాకాలకే తాము ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కగా, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల వర్తక సంఘాలు ఈ మేరకు నిర్ణయానికి కట్టుబడి అమలు పర్చనుండటంతో ఇక తమిళనాట ఎంఎన్సీ కంపెనీల శీతలపానీయాలకు చుక్కెదురుకానుంది.

జ‌ల్లిక‌ట్టు ఉద్యమ స‌మ‌యంలోనే విదేశీ పానీయాల‌ను బ‌హిష్కరించాల‌ని పిలుపునిచ్చి.. అ ఉద్యమం బాటలోనే ఈ ఉద్యమాన్ని కూడా తాము దిగ్విజయంగా కొనసాగించనున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ముందుగా సినిమాహాళ్లు, రిటైల్ దుకాణాలు, చిన్న దుకాణాలలో పెప్సీ కోలాను నిషేధించారు. ఈ కంపెనీలు తమ ఉత్పాదనల తయారీ కోసం తమ నీటిని వినియోగిస్తూ.. మళ్లీ తమ వద్ద నుంచే అధిక ధరలను వసూలు చేస్తుందని అన్నారు. అస‌లే నీళ్లు లేక రాష్ట్రం క‌రువు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న క్రమంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ‌నిగ‌ర్ సంఘం సెక్ర‌ట‌రీ మోహ‌న్ చెప్పారు. అయితే తమిళనాడు తరహాలోనే యావత్ దేశంలోని రాష్ట్రాలన్నీ ఇలాంటి నిర్ణయాలనే తీసుకుంటే బాగుంటుందని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles