జియో మరో అఫర్.. సభ్యత్వం తీసుకున్నారా..?. Reliance Jio Prime Membership Enrolment Starts Today

Reliance jio prime membership enrolment starts today

relince jio tariff, reliance jio prime tariff, jio prime member, jio prime member tariff, reliance jio, jio prime, what is jio prime offer, jio prime membership, all about jio prime offer, mukesh ambani, jio, jio plans, jio tariff

Reliance Jio has begun to roll out its Jio Prime membership plan from today. The Prime membership plan is an extension of Reliance Jio's Happy New Year plan which will end on March 31.

జియో మరో అఫర్.. సభ్యత్వం తీసుకున్నారా..?

Posted: 03/01/2017 04:44 PM IST
Reliance jio prime membership enrolment starts today

టెలికాం ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నాలు సృష్టించిన రిల‌య‌న్స్ జియో తాజాగా కొత్త స్కీముల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోనుంది. ఈ రోజు నుంచి ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను రూ.99 చెల్లించి తీసుకోవ‌చ్చని తెలిపింది. న్యూఇయ‌ర్ ఆఫ‌ర్ కొన‌సాగింపున‌కు ఈ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆపై ఉచితంగా అప‌రిమిత వాయిస్ కాల్స్‌, డేటాను పొందేందుకు నెల‌కు రూ. 303 చెల్లించాల్సి ఉంటుంద‌ని స్పష్టం చేసింది. ఈ స్కీమ్ 12నెల‌లకు వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించింది.

ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ పొందిన క‌స్టమ‌ర్ల‌కు నెల‌వారీ ప్లాన్స్‌ను కూడా ప్రక‌టించింది.రూ.149 చెల్లిస్తే ఉచిత కాల్స్‌, నెలకు 2జీబీ డేటా లభిస్తుంది. రూ.499 చెల్లిస్తే, ఉచిత కాల్స్‌తో పాటు నెలకు 60 జీబీ డేటా (రోజుకు 2జీబీ చొప్పున) వినియోగించుకోవచ్చని బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ విడుదల చేసిన ప్రక‌ట‌న‌ వెల్లడించింది. ప్రతినెలా రూ.149తో రీచార్జ్ చేసుకోన‌ట్లయితే స‌భ్యత్వంతో పాటు దానితో వ‌చ్చే ప్రయోజ‌నాలు కూడా కోల్పోతార‌ని జియో సంస్థ వివ‌రించింది. మార్చి 31లోపు జియో సభ్యత్వం తీసుకోని వారికి, సాధారణ పథకాలు అమలవుతాయి. పోటీ సంస్థల నెలవారీ పథకాలనే ఇవి పోలి ఉంటాయి. అయితే వాటికంటే డేటా మాత్రం 20 శాతం అదనంగా ఇస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఇటీవలే ప్ర‌క‌టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jio  reliance  reliance jio  prime tariff  jio prime member  telecom industry  

Other Articles

Today on Telugu Wishesh