ఈ ఎంపీగారి నోటి దూల ఏ రేంజ్ లో నంటే.. | Sakshi Maharaj communal Kabristaan remark.

Sakshi maharaj cremate muslims comments

Kabristaan Remark, Narendra Modi Graveyard Politics, Muslims Cremate, BJP MP Muslims, Anti Islam Comments, BJP MP Sakshi Maharaj, Sakshi Maharaj Unao MP, Communal Tensions BJP MP, Communal Comments, Modi Kabristaan Comments

A week after Prime Minister Narendra Modi's graveyard-cremation ground remark sparked a row, BJP leader Sakshi Maharaj said on Tuesday there should be no graveyards at all in the country and all should be cremated.A day after Sakshi Maharaj stirred up a controversy courtesy his 'Kabristaan' remark, Rashtriya Janata Dal (RJD) chief Lalu Prasad Yadav while questioning his character today demanded a thorough probe against the Bharatiya Janata Party (BJP).

ముస్లింలకు సమాధులు అక్కర్లేదు!

Posted: 03/01/2017 10:46 AM IST
Sakshi maharaj cremate muslims comments

వివాదాల పుట్ట, ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ముస్లిం సంప్రదాయం ప్రకారం, మరణించిన వారిని సమాధి చేయాలని గుర్తు చేసిన ఆయన, దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింలను సమాధి చేసేందుకు స్థలమెక్కడుందని ప్రశ్నించాడు. వారం క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ప్రచారంలో భాగంగా ఓ సభలో ప్రసంగిస్తూ ఖబరస్థాన్-సంస్థాన్ అంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర దూమారం రేపాడు. ఇక ఇప్పుడు సాక్షి మహరాజ్ దానికి కొనసాగింపు వ్యాఖ్యలు చేశాడు.

ఉన్నావోలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన "మీరు ఖబరిస్థాన్ అనండి, శ్మశానం అనండి... అందరినీ సమాధి చేయలేం. హిందువులు మరణిస్తే, స్థలం అక్కర్లేదు. దహన సంస్కారాలు చేస్తే చాలూ. సాధువుల కోసం స్మారకం కావాలి. కానీ, ఇండియాలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వారందరినీ ఎక్కడ సమాధి చేయాలి? హిందుస్థాన్ లో అంత భూమి ఎక్కడుంది?" అని ప్రశ్నించాడు. అందుకే మీరు దహన సంస్కారాలకు సిద్ధపడండి అంటూ పిలుపునిచ్చాడు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావటంతో సర్దిచెప్పుకునే యత్నం చేశాడు. మొత్తం స్మశానాలతో నిండిపోతే రైతులకు పంట పడించేందుకు భూమి ఉండదని, తాను ఆ ఉద్దేశ్యంతోనే తాను ఆ ప్రకటన చేశానని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ స్పందిస్తూ, యూపీ ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీజేపీ భావిస్తోందని, సాక్షి వ్యాఖ్యలు అందుకోసమేనని విమర్శించారు. మరోవైపు మోదీ సమాధి రాజకీయాలపై లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఐ పార్టీలు మండిపడ్డాయి. కాగా, నాలుగు వివాహాలు చేసుకొని 40 మందిని కంటున్న వారే దేశంలో జనాభా విస్పోటనానికి బాధ్యత వహించాలని మహరాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  MP Sakshi Maharaj  Muslims Graveyard  Kabristaan remark  

Other Articles

Today on Telugu Wishesh