సిటీలో ఆ రూట్ లో వెళ్లకండి.. మీ పని అంతే.. | Metro Pillar Works Traffic Diverted.

Hyderabad traffic police on route divert

Hyderabad Pillar Works, Metro Route Divert, Hyderabad Traffic Police, Hyderabad Traffic Diversion, Hyderabad Metro, Hyderabad Heavy Traffic

Hyderabad Traffic Police suggests alternate routes due to Pillar Works.

ఆ రూట్ లో వెళ్తే మీ పని అంతే...

Posted: 03/01/2017 09:42 AM IST
Hyderabad traffic police on route divert

మెట్రో రైలు పనుల జాప్యానికి సరైన కారణాలు తెలియదు గానీ ప్రస్తుతం నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ పూట బయటికి వెళ్లినా సరే చిక్కుకుపోయే పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా మెయిన్ సెంటర్ లలో ఫిల్లర్ల ఏర్పాటు పనులతో గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్ పలు సూచనలు చేశారు.

రోడ్లు పెద్దగా వైశాల్యం లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని నగర వాసులకు చెబుతున్నాడు. నగరంలోని గ్రీన్‌లాండ్స్ క్రాస్‌రోడ్(మీనా జువెల్లర్స్) వద్ద మెట్రో నిర్మాణ పనులు ప్రారంభించనుండడంతో ఆ మార్గం ద్వారా ప్రయాణించేవారు వేరే మార్గం చూసుకోవాలని కోరాడు. పంజాగుట్ట, రాజ్‌భవన్‌రోడ్, కుందన్‌బాగ్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు, ప్రయాణికులు ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ పిల్లర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినట్టు సీపీ తెలిపారు.

బుధవారం నుంచి ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సూచనను గమనించాలని జితేందర్ విజ్ఞప్తి చేశాడు. ఇక మెట్రో రైలు ప్రారంభం ఏడాదిన్నర కాలంగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈసారి అలా జరగకుండా జూన్‌లో కచ్చితంగా ప్రారంభించేలా నిర్మాణ సంస్థలు పనుల్లో వేగం పెంచాయి. ప్రధానంగా మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా బేగంపేట వరకు ఉన్న 8 కి.మీ మార్గంపై దృష్టి పెట్టాయి. పగటి పూట కూడా పనులు పూర్తి చేస్తుండటంతో అనుకున్న సమయానికే మెట్రో ప్రారంభిస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Traffic  Metro Pillar Work  Route Divert  

Other Articles

Today on Telugu Wishesh