‘‘నేను రాను బిడ్డో భారతదేశానికి’’ అంటున్న మాల్యా Vijay Mallya blames Indian media for 'blasting' him

Safe in uk vijay mallya sees no grounds for extradition to india

'Wilful' tax evader, Vijay Mallya, loans defaulter, kingfisher, Enforcement Directorate, central bureau of iinvesigation, formula one, Kingfisher Airlines, mallya, mallya money laundering, Britain

'Wilful' tax evader and fugitive Vijay Mallya, who owes India as much as Rs 9,000 crore, took to Twitter this morning to moan about the Indian media "blasting him" rather than lauding his spendy Formula 1 moves.

మాట మార్చిన మాల్యా.. బ్రిటెన్ విడచి రాడట..

Posted: 02/23/2017 01:01 PM IST
Safe in uk vijay mallya sees no grounds for extradition to india

భారత అర్థిక ఉగ్రవాదిగా విమర్శలను ఎదుర్కోంటూ.. బ్యాంకులకు 9 వేల కోట్లు రూపాయల ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా అభియోగాలు నమోదైన విజయ్ మాల్యా.. మాట మార్చారు. వేల కోట్లు రూపాయలను తిరిగి చెల్లిస్తానని అందుకు తన న్యాయవాదితో కోర్టులకు చెప్పించిన మాల్యా.. తాను వ్యాపారంలో చాలా కోల్పోయానని, తాను రుణాలు తీసుకున్న అసలులో కొంత భాగం మాత్రం చెల్లిస్తానని, అందుకు బదులుగా తనపై నమోదైన కేసులన్నీంటినీ ఉపసంహరించాలని షరుతు పెట్టి.. తన అస్తులను వేలం వేయించుకున్న మాల్యాను  ఎలాగైనా భారత్కు రప్పించాలని ఓ వైపు ఇండియన్ అధికారులు ప్రయత్నాల నేపథ్యంలో తాను మాత్రం బ్రిటెన్ విడచి రానని తేల్చిచెప్పారు.

భారత్ నుంచి పారిపోయారన్న విమర్శలపై తొలినాళ్లలో తీవ్రంగా స్పందించిన మాల్యా.. తాను భారత్ నుంచి పారిపోయానన్న విమర్శలు సరికావని, తాను అరుమాసాల్లో తిరిగి భారత్ కు వస్తానని నమ్మబలికారు. అంతేకాదు తాను పారిపోయిన నేపథ్యంలో కథనాలు రాసిన మీడియాను కూడా ఓ స్థాయిలో హెచ్చరించిన మాల్యా.. తన నుంచి ప్రతికల యాజమాన్యాలు, మీడియ ప్రతినిధులు పోందిన లాభాలను, సాయాలను మర్చిపోరాదని కూడా సూచించారు. అలాంటి మాల్యా ఇప్పుడు తాను నిజంగానే పారిపోయాను.. ఇక బ్రిటెన్ విడచి రాను అని అంటున్నారు.

యూకే చట్టాల కిందే తాను సురక్షితంగా ఉన్నట్టు  చెప్పారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రుణాల విషయంలో మోసం, కుట్ర కింద తనపై నమోదైన కేసులను ఆయన కొట్టిపారేశారు. ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగంగా ఖర్చుచేయలేదన్నారు.  కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం తనని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తున్నాయంటూ మండిపడ్డారు. తనను ఎన్నికల ప్రచార సందర్భంగా రెండు అతిపెద్ద పార్టీలు ఓ పొలిటికల్ ఫుట్ బాల్లా ఆడుకుంటున్నాయని ఆరోపించారు.  మాల్యాకు సాయం చేశారంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఎన్నికల క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.

తన సివిల్ కేసును సీబీఐ ప్రభుత్వ ఉత్తర్వులతో క్రిమినల్గా కేసుగా మార్చిందని ఆరోపించారు. రుణాలు రికవరీ చేసుకోవడం పూర్తిగా సివిల్ అంశం కిందకు వస్తోంది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాన్ని క్రిమినల్ గా మార్చింది. ప్రతి దాన్ని తాను లీగల్ గా ఛాలెంజ్ చేసే అవకాశముందన్నారు. తనపై వారు ఎలాంటి కేసు పెట్టలేరని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.   మరోవైపు మీడియాపై కూడా మాల్యా మండిపడ్డారు. ఫార్ములా 1లోకి ఇండియన్ ఎంట్రీని పొగడాల్సింది పోయి, మీడియా దాన్ని రాద్ధాంతం చేస్తుందని సీరియస్ అయ్యారు. ఇండియన్ మీడియా కామెంట్లు చాలా బాధకరమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 'Wilful' tax evader  Vijay Mallya  Britain  political football  indian authorities  cbi  ED  Britain  

Other Articles

Today on Telugu Wishesh