ప్రోఫెసర్ వర్సెస్ టీ జేఏసీ.. పుల్లలు పెడుతున్నారా? | T JAC leaders clashes with Kodandaram.

Differences between professor kodandaram and t jac leaders

Nirudyoga Nirasana Rally, Kodandaram JAC Leaders, Telangana JAC Clashes, Kodandaram T JAC, Differences in T JAC, Telangana JAC Meeting, Telangana Joint Action Committee Meeting

Differences between T JAC Leaders and its chairman Prof. M. Kodandaram, over Nirudyoga Nirasana Rally failure.

ర్యాలీ అట్టర్‌ప్లాప్‌.. జేఏసీలో చీలిక??

Posted: 02/23/2017 02:48 PM IST
Differences between professor kodandaram and t jac leaders

కేసీఆర్ సర్కార్ పై సమరశంఖం పూరించిన తెలంగాణ జేఏసీ నిరసన ర్యాలీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. నాగోలు లో అనుమతి దొరికినప్పటికీ ముందస్తు అరెస్ట్ లతో ర్యాలీ అంతగా సక్సెస్ కాలేదనే చెప్పుకోవాలి. అయితే కొత్త పార్టీ అంటూ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే జేఏసీలో లుకలుకలు మొదలయ్యాయి. ప్రోఫెసర్ కోదండరామ్ పై జేఏసీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించటంతో ఇవి బయటపడ్డాయి.

నిజానికి నాగోల్ లో నిరుద్యోగ ర్యాలీని నిర్వహించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా... ర్యాలీని ఎందుకు నిర్వహించలేదని కొందరు నేతలు ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం కోదండరామ్ పాకులాడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ మీటింగ్ ను కన్వీనర్ పిట్టల రవీందర్ సహా మరికొందరు నేతలు బహిష్కరించారు. జేఏసీ ఛైర్మన్ కోదండ రాం ఒంటెద్దు పోకడలకు పోతున్నారంటూ వారు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ర్యాలీలో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగులు రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ... నాగోల్ లో సభ నిర్వహించడానికి కోదండరాం అయిష్టత చూపారని కొదరు జేఏసీ నేతలు చెప్పారు. నగర నడిబొడ్డులోనే ర్యాలీని నిర్వహించాలని ఆయన పట్టుబట్టారని విమర్శించారు. నగర నడిబొడ్డున కాకున్నా... ఏదో ఒక దగ్గర ర్యాలీ నిర్వహించి ఉంటే, నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్లేవని చెప్పారు. ఈ నేపథ్యంలోనే, తాము సమవేశాన్ని బహిష్కరించామని తెలిపారు.

టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ ర్యాలీ అట్టర్‌ప్లాప్‌ అయిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కోదండరాం ప్రయత్నిస్తున్నారని, ప్రజలు ఆ కుట్రలను గమనిస్తున్నారని తెలిపాడు. అయితే విద్యార్థులను అడ్డుకున్నారని, అయినప్పటికీ కొన్ని చోట్ల ర్యాలీ సక్సెస్ అయ్యిందని కోదండరాం చెబుతున్నారు. స‌ర్కారు మీసాలు మెలివేస్తే అంత‌క‌న్నా అన్యాయం మ‌రొక‌టి ఉండదన్న ఆయన, మొత్తం ఐదు వేల మంది అరెస్టు అయ్యారని కోదండరాం చెప్పారు.

ఇందిరా పార్క్ దిగ్భందం, హాస్ట‌ళ్ల ముందు, వర్సిటీల్లో పోలీసులు మోహరింపు జరిగినప్పటికీ, యూనివ‌ర్సిటీల్లో ర్యాలీ నిర్వ‌హించారని చెప్పారు. అదే విధంగా సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం వ‌ద్ద కూడా నిర‌స‌న తెలిపారని అన్నారు. పోలీసులు అడ్డుకోవాలని చూసినప్పటికీ ఒకవేళ ర్యాలీ జరిపితే ఎంత ప్ర‌చారం జ‌రిగేదో అంతే స్థాయిలో ప్ర‌భావం చూపిందని చెప్పటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Professor Kodandaram. T JAC  Nirudyoga Nirasana Rally  

Other Articles