‘అమ్మ’మృతిపై విచారణ ఫైలుపైనే తొలి సంతకం.. రాష్ట్రపతిని కలువున్న స్టాలిన్ MK Stalin sensational comments on death of jayalalithaa

Stalin says will probe jayalalithaa s death if his government comes into power

tamil nadu, DMK, mk stalin, President, Pranab Mukharjee, sasikala, jayalalithaa, sasikala jayalalithaa, jayalalithaa death, palnisamy, paneer selvam, sasikala, chief minister, tamil nadu politics

Opposition DMK organising president MK Stalin sensational comments on death of jayalalithaa, says his government order probe into jayalalithaa's death if comes int power

‘అమ్మ’మృతిపై విచారణ ఫైలుపైనే తొలి సంతకం.. రాష్ట్రపతిని కలువున్న స్టాలిన్

Posted: 02/23/2017 10:22 AM IST
Stalin says will probe jayalalithaa s death if his government comes into power

తమిళనాడులో పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, విశ్వాస పరీక్ష నెగ్గినా.. ఆ ప్రభుత్వంపై ముప్పేట దాడికి పూనుకుంటున్నారు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్. తమిళనాడులో చోటుచేసుకుంటున్న రాజ్యాంగవ్యతిరేక పరిణామాలనై ఆయన ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి వివరించనున్నారు. పళనిస్వామి విశ్వాస పరీక్ష చెల్లదంటూ ఓ వైపు, ఎమ్మెల్యేల అందరినీ అక్రమంగా గొల్డన్ బే రిసార్టులో నిర్భందించి.. వారిని ఓటింగ్ కు తీసుకువచ్చారని పేర్కోంటూ రెండు వేర్వేరు పిటీషన్లను మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన స్టాలిన్.. ఇటు పార్టీ పరంగా కూడా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అయన పళినిస్వామి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా స్టాలిన్ చేసిన సంచలన వ్యాఖ్యలు తమిళనాడు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మన్నార్ గుడి మాఫియా పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటమే తన లక్ష్యమని, మాఫియాలకు ప్రజలను పారలించే హక్కు ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. రోజుకో నేతను జైలుకు పిలిపించుకుంటూ అక్కడి నుంచి రిమోట్ ద్వారా పాలనను కొనసాగిస్తున్న శశికళ బినామీ ప్రభుత్వాన్ని తరిమికొడదామంటూ పిలుపునిచ్చారు. అడ్డ దారిలో ముఖ్యమంత్రిని కావాలన్న ఆలోచన తనకు ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే అధికారంలోకి వచ్చి, తాను ముఖ్యమంత్రి అయితే... జయ మృతిపై విచారణ సంఘం ఏర్పాటు చేసే ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని స్టాలిన్ తెలిపారు.

అన్నాదురై అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్పటి మంత్రి సాదిక్ బాషా ఎప్పటికప్పుడు సమాచారం అందించారని గుర్తు చేశారు. ఎంజీఆర్ అనారోగ్యం పాలైనప్పుడు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హండే ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె పరిస్థితి గురించిన సమాచారాన్ని అంత సీక్రెట్ గా ఎందుకుంచారని ప్రశ్నించారు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం కూడా పొంతన లేకుండా ఉందని విమర్శించారు. జయ మృతిపై విచారణ సంఘం ఏర్పాటు చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు.  తమిళనాడులో చోటుచేసుకుంటున్న రాజ్యాంగవ్యతిరేక పరిణామాలనై ఆయన ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి వివరించనున్నారు. తమిళనాట మనార్ గుడి మాఫియా పాలనను సాగనంపాలని కోరనున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles