ఎంగిలి విస్తారాకులు ఎత్తుకునేవాడు అన్నారు.. అయినా ఫీలవ్వను: పవన్ Pawan speech at Mangalagiri Chenetha Sathya Graha Sabha.

Pawan kalyan speech at chenetha sathyagraham

Chenetha Satyagraha, Pawan speech at Chenetha Satyagraha, Mangalagiri Chenetha Satyagraha, Chenetha Satyagraha Sabha, Chenetha Satyagraha Speech, Mangalagiri Chenetha Satyagraha

Janasena Chief Pawan kalyan speech at Chenetha Satyagraha In Mangalagiri.

కించపరిచినా గర్వంగా ఫీలవుతా : పవన్ కళ్యాణ్

Posted: 02/20/2017 06:18 PM IST
Pawan kalyan speech at chenetha sathyagraham

చేనేత ను గౌరవించటం అంటే దేశ సంస్కృతిని గౌరవించటమేనని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. సోమవారం ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సాధికారంత సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహం ‘ఐక్య గర్జన సభకు’ పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ వ్యవహరించేందుకు పవన్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సత్యాగ్రహ సభలో సుమారు లక్ష మందికి పైగా హాజరయ్యారు.

ఉదయం నుంచే దీక్ష ప్రారంభించగా, హాజరైన పవన్ చేనేత కార్మికులకు సంఘీభావం ప్రకటించి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశాడు. అనంతరం ప్రసంగ వేదిక మీదకు నేతలతోసహా చేరిన పండితుల ఆశీర్వాదాలు అందుకున్నాడు. ఈ సందర్భంగా పవన్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆపై పండితులు పవన్ తో సెల్ఫీల కోసం ఎగబడటం కొసమెరుపు. ముఖ్య నేతలు ప్రసంగించిన తర్వాత పవన్ ప్రసంగించాడు. చేనత కార్మికుల పిల్లలు పస్తులు ఉండటం స్కూల్ దశలోనే తాను స్వయంగా చూశానని పవన్ తెలిపాడు. చేనేత కార్మికులు అంటే ఒప్పుకోమన్న పవన్, చేనేత కళాకారుడు అంటానని తెలిపాడు. రైతన్న, నేతన్న, జవాన్ అంటే నాకెంతో ఇష్టమని అని పవన్ తెలిపాడు.

చేనేత కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాననే తనని కొందరు హేళన చేశారని, విస్తరాకులు ఎత్తుకునేవాడిగా ఓ నేత కామెంట్ కూడా చేశాడని, కించపరిచినా గర్వంగా ఫీలవుతానని, కానీ, దయ చేసి ఇలాంటి మాటలతో కుల వృత్తుల వారిని హేళన చేయొద్దంటూ కోరాడు. రాజకీయ నాయకులకు ఇదే నామనవి అన్న పవన్... అందరూ తన లాగా విశాల ధృక్ఫథంతో ఆలోచించరంటూ తెలిపాడు. ప్రపంచంలో శుభ్రపరిచేవారు లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండంటూ పేర్కొన్నాడు. సత్యాగ్రహం అంటే నిజం తాలుకు కోపమని అభివర్ణించాడు. లక్షలాది మంది ప్రజల పొట్టకొడుతున్న వ్యాపారస్థులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అంుదకు ఒక ఎన్ ఫోర్స్ మెంట్ ఏర్పాటు చేయాలని కోరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mangalagiri  Chenetha Satyagraha  Pawan Kalyan  Speech  

Other Articles