తమిళనాట వేడెక్కిన రాజకీయం.. పళనికి వ్యతిరేకంగా డీఎంకే ఓటు dmk to vote against aiadmk and palanisamy says stalin

Will oppose palanisami in tn assembly if he seeks vote of trust says stalin

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Palanisamy, R. Natarajan, Stalin, Bengaluru, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

"In AIADMK's regime, there has been a complete breakdown of law and order in the state. So to show our opposition, we will participate in the assembly and vote against him", Stalin said.

తమిళనాట వేడెక్కిన రాజకీయం.. పళనికి వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు..!

Posted: 02/17/2017 07:21 PM IST
Will oppose palanisami in tn assembly if he seeks vote of trust says stalin

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే పక్ష నేత.. శశికళ వర్గం నేత పళనిసామి ప్రమాణ స్వీకారం చేసి శనివారం బలనిరూపణకు పూనుకోవడంతో.. తమిళనాడులో మళ్లీ రాజకీయం వేడెక్కింది. ముందుగా సోమవారం రోజున బలాన్ని నిరూపించుకుంటానని ప్రకటించిన పళనిస్వామి తరువాత శనివారాన్ని ఎంచుకోవడంతో.. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది. అసెంబ్లీలో బలనిరూపణ కార్యక్రమంలో పాల్గోంటామని అయితే తటస్తంగా వుంటామని చెప్పిన డీఎంకే ముఖ్యనేత స్టాలిన్.. సాయంత్రానికి వ్యూహాన్ని మర్చారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీ అది నుంచి ప్రజావ్యతిరేక పాలన సాగిస్తుందని, ప్రజావ్యతిరుేక విధానాలకు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఇవాళ సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన తమ పార్టీ శాసనసభ్యులతో సమావేశమై పళనిస్వామి ప్రభుత్వ బలనిరూపణ అంశమై చర్చించారు.

రాష్ట్రంలో పాలన పూర్తిగా దెబ్బతిందని, ప్రజాజీవనం అతలాకుతలమైందని ఆయన విమర్శించారు. సుస్థిర పాలన కావాలని తాము మొదట్నించీ కోరుతున్నట్టు చెప్పారు. ఇందుకు అనుగుణంగానే పళనిస్వామికు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ నిర్ణయించినట్టు మీడియాకు తెలిపారు. అంతకుముందు స్టాలిన్ అధ్యక్షతన అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో 89 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

అయితే కాంగ్రెస్ కు చెందిన శాసనసభాపక్షం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్నది కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి 8 మంది శాసనసభ్యుల బలం వుంది. దీంతో వీరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారా..? లేక తటస్తంగా వుంటారా..? లేక ప్రభుత్వానికి మద్దతు పలుకుతారా..? అన్న విషయమై శనివారం ఉదయం క్లారిటీ వచ్చే అవకాశాలు వున్నాయి. శనివారం ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఈ అంశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇక పళనిస్వామి తమ వర్గం ఎమ్మెల్యేలను పట్టుజారిపోనీయకుండా చర్యలకు పూనుకుంటున్నారు. ఇప్పటికే గొల్డన్ బే రిసార్టులో 8 రోజుల పాటు వున్న ఎమ్మెల్యేలను ఇవాళ రాత్రికి రాత్రి జారిపోకుండా చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. అసెంబ్లీలోని పన్నీరు సెల్వం వర్గంతో పాటు విపక్షాలన్నీ ఏకంగా వచ్చిన తన బలనిరూపణకు ఎలాంటి అటంకాలు కలగకుండా వుండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్ కు 8 మంది, పన్నీరు వర్గానికి 11 మంది ఎమ్మెల్యేలతో పాటు ఒక స్వతంత్ర్య అభ్యర్థి ప్రతిపక్షంగా వుండగా, పళనిస్వామి మాత్రం తనకు 123 మంది సభ్ుల బలముందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  panneerselvam  R. Natarajan  Stalin  governer  AIADMK  tamilnadu  

Other Articles