‘‘ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యుంటే..’’ పవన్ కల్యాన్ సంచలన విషయాలు 'I was depressed and suicidal': Pawan Kalyan's sensational revelation

I was depressed and suicidal pawan kalyan s sensational revelation

pawan kalyan suicide, pawan kalyan depression, pawan kalyan harvard, pawan kalyan katamarayudu, pawan kalyan speech, pawan kalyan jana sena party

Pawan Kalyan touched upon a lot many topics, ranging from personal struggles and cinematic career to his political ambitions.

‘‘ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యుంటే..’’ పవన్ కల్యాన్ సంచలన విషయాలు

Posted: 02/12/2017 03:53 PM IST
I was depressed and suicidal pawan kalyan s sensational revelation

తన జీవితంలో ఎన్నో బాధలను తాను ఎదుర్కున్నానని, తీవ్రమైన ఒత్తిడికిలోనై పలుమార్లు ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, వాటిల్లో ఏ ఒక్కటి సక్సెస్ అయినా, తానిక్కడ నిలబడి ఉండేవాడిని కానని జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పారు. తన జీవితంలోని అనేక విషయాలను హార్వార్డ్ యూనివర్శిటీలో జరుగుతున్న 'ఇండియా కాన్ఫరెన్స్'లో ఆయన తన ప్రసంగం ద్వారా విద్యార్ధులతో పంచుకున్నారు. చిన్నతనంలో టీచర్లు చెప్పిన అంశాలు నిజ జీవితంలో కనిపించక, చదివేది, చూసేది వేరువేరని మనసుకు తెలుస్తుంటే, వాస్తవం చెప్పేవారు లేక తానెంతో మానసిక క్షోభను అనుభవించానని చెప్పారు. టీచర్లు తనను కొడుతూ ఉంటే ఒక్కోసారి తట్టుకోలేకపోయానని అన్నారు.

పదో తరగతి నుంచి అన్ని క్లాసులూ తప్పుతూనే వచ్చానని అన్నారు. ఎన్నోసార్లు ఇక జీవితం వద్దని భావించానని చెప్పారు. జీవితంలో ఎటు వెళ్లాలో నిర్ణయం తీసుకోలేకపోయిన రోజున, ఒడిదుడుకులు ఎదురైన రోజున ఆత్మహత్య చేసుకోవాలని భావించి, ప్రయత్నించి విఫలమైనానని చెప్పుకొచ్చారు. తన ఫ్రెండ్స్ అంతా పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళుతుంటే, తన మనసు బాధపడేదని, తాను వెళ్లలేకపోయినందుకు చింతించానని చెప్పారు. ఆయన ప్రసంగం సభికుల్లో ఉత్తేజంతో పాటు కంటతడిని కూడా పెట్టించింది. అయితే తాను చదువులో రాణించలేకపోవడానికి తన తండ్రి ఉద్యోగం కూడా ఒక కారణమని తెలిపారు జనసేనాని. చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న అనుభవాలను చెబుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు పవన్.

ఒక రోజు టీచర్ 'మా బడి' అనే పాఠం చెబుతున్న వేళ జరిగిన ఘటన గురించి చెప్పారు. "పాఠశాల ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆటస్థలం, చెట్లు, మొక్కలు, లైబ్రరీ తదితర సదుపాయాలు... ఇలా చెప్పుకుంటూ వెళుతున్న వేళ, నేను నా పక్క విద్యార్థితో మాట్లాడుతూ ఉన్నాను. అది చూసిన టీచర్ నన్ను లేపి ఏం మాట్లాడుతున్నావని అడిగింది. మన స్కూల్ లో ఆటస్థలం లేదు, బుక్స్ లేవు, చెట్లు కూడా లేవు. అదే విషయాన్ని చెబుతున్నానని చెప్పాను. అంతే... టీచర్ నన్ను బాగా కొట్టారు. అది ఇప్పటికీ మరచిపోలేను. ఆ క్షణంలో నాకు తెలిసింది ఏంటంటే... పుస్తకాల్లో చెప్పేది వేరు, వాస్తవంగా జరిగేది వేరు. చెప్పేది ఒకటి... చేసేది ఒకటి' అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అందుకే నేను రాసిన పరీక్షల్లో విజయవంతంగా ఫెయిల్ అయ్యాను. నా జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది" అని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles