బంగ్లా ముందు 459 పరుగుల విజయలక్ష్యం India declares to set Bangladesh 459-run target

India declares throws the gauntlet to the visitors

India vs Bangladesh, Bangladesh vs India, one-off Test, virat kohli, rahim, sports, cricket

Virat Kohli declares after India pile on runs in the second session. Bangladesh will have a tough time defending their wickets as pitch conditions have started to deteriorate.

బంగ్లా ముందు 459 పరుగుల విజయలక్ష్యం

Posted: 02/12/2017 03:12 PM IST
India declares throws the gauntlet to the visitors

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా పర్యాటక జట్టు ఎదుట భారీ విజయలక్ష్యాన్ని వుందింది. భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ ను 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసి.. కష్టసాధ్యమైన 459 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ప్రత్యర్థుల ముందు పెట్టింది. ఈ మ్యాచ్ లో రేపు సాయంత్రంలోగా 459 పరుగులు అసాధ్యమని అంచనా. అదే సమయంలో అన్ని వికెట్లు నష్టపోకుండా కాపాడుకోగలిగితే బంగ్లాదేశ్ మ్యాచ్ ను డ్రా చేసుకున్నట్లే. అయితే సోమవారం నిర్ణీత 90 ఓవర్లలో బంగ్లా వికెట్లను చేజార్చుకుంటు విజయం టీమిండియాను వరించినట్లే.

ఇదిలా వుండగా, తొలి ఇన్నింగ్స్ లో 687 పరుగులకు డిక్లేర్ చేసి, ఆపై బంగ్లాదేశ్ ను 388 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం స్వల్ప స్కోరుకే కీలక వికెట్లను చేజార్చుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో విజయ్ 7, రాహుల్ 10, కోహ్లీ 38 పరుగులకు అవుట్ అయ్యారు. వీరు భారీ స్కోరును చేయడంలో విఫలమైనప్పటికీ, సాధ్యమైనంత వేగంగా పరుగులను చేసే క్రమంలో అవుట్ అయ్యారు. ఇండియా రెండో ఇన్నింగ్స్ లో పుజారా 54, కోహ్లీ 38, రహానే 28, జడేజా 16, రాహుల్ 10, విజయ్ 7 పరుగులు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Bangladesh  Bangladesh vs India  one-off Test  virat kohli  rahim  sports  cricket  

Other Articles