చిన్నమ్మ చెరలో ఎమ్మెల్యేలు బంధీలా..? విచారించనున్న డీజీపీ sasikala suspends senior mla madhusudanan from party

Governor vidyasagar rao summons dgp

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, E Madhusudhanan, O.Panneerselvam, March 2012, VK Sasikala, letter, betray, vidyasagar rao, PM modi, Governor, tamil politics

senior AIADMK leader E Madhusudhanan suspended from the party after he complaints to Election commission questioning her elevation as party general secretary

చిన్నమ్మ చెరలో ఎమ్మెల్యేలు బంధీలా..? విచారించనున్న డీజీపీ

Posted: 02/10/2017 04:33 PM IST
Governor vidyasagar rao summons dgp

తమిళనాట క్షణక్షణం మారుతున్న రాజకీయ సమీకరణలు ఇక రాజ్ భవన్ పైకి మళ్లాయి. ఇరువర్గాలతో వేర్వేరుగా చర్చలు జరిపిన గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారు..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్ర రాజధానికి చెన్నైకి చేరుకోగానే అందరిచూపు ఆయనవైపుకు మళ్లాయి. గవర్నర్ ఎవరెవరికీ ఏయే హామీలను ఇచ్చారన్న విషయం మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. నిన్న సాయంత్రం చెన్నై చేరకున్న ఆయన ఇవాళ రాష్ట్ర డీజీపీకి సమన్లు జారీ చేశారని సమాచారం.

మద్రాసు హెకోర్టు అదేశాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ బాస్ ను పిలపించి.. శశికళ వర్గంలో కొందరు ఎమ్మెల్యేలు బలవంతంగా వుండిపోయారని, వారికి ఆ వర్గంలో కొనసాగడం ఇస్టం లేకపోయినా.. శశికళ అనుచరులు పహారాను దాటి రాలేకపోతున్నారన్న వార్తలు వినిపించడం.. ఇక పలువరు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కూడా అరోపణలు వచ్చిన తరుణంలో డీజీపీతో ఈ విషయమై గవర్నర్ చర్చించినట్లు సమాచారం.

శశికళ వర్గంలో ఎమ్మెల్యేగా వున్న తన భార్య కనిపించడం లేదని కూడా పిర్యాదులు రావడంతో గవర్నర్ ఎమ్మెల్యేలను శశికళ వర్గం నిజంగానూ బంధీలుగా చేసుకుందా..? లేక వారు స్వతహాగానే క్యాంప్ లో వున్నారా..? అన్న విషయమై డీజీపీ విచారించనున్నారు.ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే చీఫ్ సెక్రటరీ శశికళ మధ్య ఎవరు సీఎం అనేది తేలాలిన ఈ సమయంలో ఎమ్మెల్యేలు కననపడకపోవడంపై ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తర్వాత కనిపించకపోవడంపై ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు తీవ్ర  ఆందోళన చెందుతున్నారు. వెంటనే తమ వారు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలని పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ ను స్వీకరించిన మద్రాస్ హైకోర్టు వెంటనే ఎమ్మెల్యేల జాడ కనుక్కోవాలని వస్తున్న ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు పన్నీర్ సెల్వం క్యాంప్ లోని ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా తమ వాయిస్ ను మరింత పెంచారు. అమ్మ ఎంపిక చేసిన వ్యక్తి పన్నీర్ సెల్వమని.. ఆయనే సీఎం కావాలనదే తమ అందరి అభిమతమని కుండబద్దలు కొట్టారు. తమిళ ప్రజలకు ఏది మంచో అదే చేస్తామన్నారు. ఇదిలావుండగా శశికళపై ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేసిన అన్నాడీఎంకే సీనియర్ ఎమ్మెల్యే మదుసూదనన్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ చిన్నమ్మ నిర్ణయం తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles