రాజీనామాను వెనక్కు తీసుకుంటా.. అమ్మ మృతిపై విచారణ జరిపిస్తాం We will seek probe into Jayalalithaa's death, says OPS

Will prove strength in tn assembly says panneerselvam

Sasikala,Tamil Nadu Chief minister,O Panneerselvam,Tamil Nadu,AIADMK,DMK,Amma,Vidyasagar Rao

Uncertainty has grown over the political situation in Tamil Nadu as Panneerselvam has alleged that he was forced to resign from the chief minister's post by Sasikala and her supporters.

ITEMVIDEOS: నన్ను తప్పించే అధికారం ఎవరికీ లేదు.. బలనిరూపణకు సిద్దం

Posted: 02/08/2017 11:06 AM IST
Will prove strength in tn assembly says panneerselvam

తాను అన్నాడీఎంకే పార్టీకి నిత్యం కట్టుబడి వున్నానని, ఎన్నాడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి, అమ్మ (జయలలిత) విధేయుడు పన్నీర్ సెల్వం అన్నారు. అధికారం వున్నా. లేకున్నా తాను ఎవరికీ అన్యాయం చేయలేదని చెప్పుకోచ్చారు. తనను తెరవెనుకగా బీజేపి నడిపిస్తుందన్న అరోపణలను ఆయన ఖండించారు. దీంతో పాటు తాను డీఎంకే పార్టీకి సన్నిహితంగా వుంటున్నట్లు చేస్తున్న ప్రచారంలోనూ నిజం లేదని తేల్చిచెప్పారు.

ఈ నేపథ్యంలో తాను నోరు విప్పితే అందరి జాతకాలు బయటపడతాయంటూ ఒకవైపు హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేసిన ఆయన తనను పార్టీ కోశాధికారిగా అమ్మ నియమించారని, తనను పార్టీ పదవుల నుంచి తొలగించడం ఎవరి వల్ల సాథ్యం కాదని అన్నారు. పన్నెండు గంటల వ్యవధిలో రెండో పర్యాయం మీడియా ముందుకు వచ్చిన ఆయన జయ మృతిపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ మృతిపై నెలకొన్న అనుమానాల విషయంలో విచారణ జరిపిస్తామని, హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో చర్చలు జరిపామని, విచారణకు ఆదేశిస్తామని పన్నీర్‌ సెల్వం పేర్కొన్నారు.

అమ్మ ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు తాను ప్రతి రోజూ వెళ్లానని అయితే శశికళ తనను అడ్డుకుని అమ్మను చూడనీయలేదని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని.. మాట్లాడనని అన్నారు. ఎంజీఆర్, జయలలిత బాటలో నడుస్తానని పన్నీర్‌ సెల్వం స్సష్టం చేశారు. తాను తీసుకున్న నిర్ణయాల పూర్తిగా తనవేనని చెప్పుకోచ్చిన ఆయన తన వెనుక బీజేపీ ప్రమేయం వుందన్న వార్తలను ఖండించారు. తన వెనుక ఎవరి మద్దతు లేదని చెప్పారు.

తన రాజీనామాను వెనకఅసెంబ్లీలో తన సత్తా చూపిస్తానని, బల పరీక్షకు సిద్ధమని సెల్వం చెప్పారు. అన్నాడీఎంకే పార్టీని రక్షించాల్సిన బాధ్యత తనపై వుందని అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వాన్ని కూడా ఏకకాలంలో గాడిలో పెడతానని చెప్పుకోచ్చారు. త‌న‌కు వ్య‌తిరేకంగా కుట్రలు జ‌రిపితే ప‌లు నిజాలు బ‌య‌టపెడ‌తాన‌నే సంకేతాలు ఇస్తూ ప‌న్నీర్ సెల్వం మ‌రింత ఉత్కంఠ పెంచుతున్నారు. వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని అన్నారు. మ‌రోవైపు ప‌న్నీర్ సెల్వంకు మ‌ద్దతు పెరుగుతోంది. ప‌న్నీర్ సెల్వం నివాసానికి వ‌చ్చిన ఎంపీ మైత్రేయ‌న్ ఆయ‌నకు మ‌ద్దతు తెలుపగా, అటు మాజీ స్పీకర్ బీహెచ్ పాండన్ కూడా సెల్వాం జట్టులో చేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala  Tamil Nadu Chief minister  O Panneerselvam  Tamil Nadu  AIADMK  DMK  Amma  Vidyasagar Rao  

Other Articles