‘‘త్వరలో గుడ్ న్యూస్: క్రెడిట్ కార్డు లావాదేవీలపై సేవాచార్జీల తగ్గింపు’’ Cost of digi payment will come down: FM

Government confident that debit card charges may decline

Rs 500 notes, Rs 1000 notes, demonetisation, Arun Jaitley, Debit card charges, Reserve bank of India, finance ministry, cashless economy, ditigal payments, RBI governor, Urjit patel, PM modi, debit cards, debit card charges, fake currency

"RBI is deciding on thisit is work in progress. I am sure as volumes (of digital transactions) are increasing, the charges will come down," the Finance Minister Arun Jaitley said.

‘‘త్వరలో శుభవార్త: క్రెడిట్ కార్డు లావాదేవీలపై సేవాచార్జీల తగ్గింపు’’

Posted: 02/08/2017 11:30 AM IST
Government confident that debit card charges may decline

భారత దేశాన్ని అవినీతి రహిత దేశంగా రూపోందించే క్రమంలో క్యాష్ లెస్ ఎకానీమినీ ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం.. త్వరలోనే దేశ ప్రజలకు శుభవార్తను అందించనుంది. డిజిటల్ పేమెంట్ ద్వారా లావాదేవీలు జరిపే ప్రజలకు డెబిట్ కార్డు సేవా ఛార్జీలు తగ్గించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు ప్రతిపాదనలు సిద్దం చేస్తుందని కేంద్ర అర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ భారతీయ సెంట్రల్ బ్యాంకుతో చర్చలు జరుపుతుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పాత పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయని అరుణ్ జైట్లీ తెలిపారు.

రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే డెబిట్ కార్డు లావాదేవీలకు మార్జినల్ డిస్కౌంట్ ఛార్జీలను(ఎండీఆర్) రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుందని జైట్లీ తెలిపారు. ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న వెంటనే అవి అమల్లోకి వస్తాయన్నారు. కొత్త టెక్నాలజీస్ తో డిజిటల్ లావాదేవీలు మరింత చౌకగా లభ్యమవుతాయని,  ఎక్కువ మంది ప్రజలు డిజిటల్ వైపు మరలుతారని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. డిజిటల్ మనీనే వాడాలని తమ అధికారులకు కూడా ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కొత్త కరెన్సీ నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేయడం ముందస్తుగానే ప్రారంభించిందని, కానీ ఏటీఎం మిషన్లలోకి అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles