చిన్నమ్మను అంతలా అడ్డుకుంటుంది ఎవరసలు? | No Sasikala Natarajan swearing-in today.

Suspense over sasikala takeover as cm continues

AIADMK General Secretary, VK Sasikala Natarajan Swear, Sasikala Natarajan Chif Minister, PIL Sasikala, Sasikala Natarajan, Rajendar Sasiakala, Sasikala Natarajan Swearing-in, Governor Vidyasagar Rao Sasikala

Suspense Continues As AIADMK General Secretary VK Sasikala Natarajan swearing as Chief inister. PIL in SC to stall swearing-in of Sasikala Natarajan as Tamil Nadu CM. T Rajendar Comments against Sasikala. Sasikala swearing-in depends on travel plans of Governor Vidyasagar Rao.

సీఎం శశికళ, సస్పెన్స్.. సస్పెన్స్...

Posted: 02/07/2017 09:00 AM IST
Suspense over sasikala takeover as cm continues

తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు అందుబాటులో లేకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే, రాజ్ భవన్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి ఈ మేరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం రద్దు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలకు గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్ మెంట్ ఇంత వరకూ లభించని విషయం తెలిసిందే.

అయితే కావాలనే గవర్నర్ ఇలా చేస్తున్నాడా? అన్న సందేహాలు కలగక మానవు. దానికి కారణం ఆమెపై ఉన్న అక్రమాస్తుల కేసులో వచ్చే వారం సుప్రీం కోర్టు తీర్పునివ్వబోతుండటమే. ఒక వేళ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత.. ఆ కేసులో ఆమె దోషిగా సుప్రీం తీర్పు ఇస్తే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పన్నీర్ సెల్వంను ఇంకా కొద్దిరోజులపాటు పదవిలో కొనసాగాలని కోరాడంట. అయితే అందుకు సెల్వం విముఖత చూపినట్లు తెలుస్తోంది. అయితే వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో శశికళ ప్రమాణం స్వీకారంపై సందిగ్ధత నెలకొంది.

గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు సోమవారం ఢిల్లీ వెళ్లి.. అక్కడి నుంచి చెన్నై రాకుండా ముంబై వెళ్లిపోవడంతో శశికళ ప్రమాణం స్వీకారం వాయిదా పడుతుందా అనే అనుమానం బలపడుతోంది. ఈ విషయంలో తనపై విమర్శలు రాకూడదన్న నెపంతోనే ఆయన న్యాయ సలహా తీసుకోవడానికి గవర్నర్‌ ఢిల్లీ వెళ్లినట్లు మహారాష్ట్ర రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని చెన్నైకు చెందిన ఓ ఎన్జీఓ సంస్థ సుప్రీంకోర్టును పిల్‌ ద్వారా ఆశ్రయించింది. ఈ పిల్‌ను మంగళవారం సుప్రీం కోర్టు విచారించనుంది. అయితే ఇవేం పట్టనట్లు శశికళ సీఎం పగ్గాలు చేపట్టడానికి రెడీ అయిపోయింది. ఇందుకోసం మద్రాస్‌ యూనివర్సిటీ ఆడిటోరియాన్ని వేగంగా ముస్తాబు చేస్తున్నారు.

ఇక ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీ హస్తం ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల్లో భాగంగా వ్యూహాత్మకంగానే శశికళ ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ తో వాయిదా వేయిస్తున్నారంటూ వారు విశ్లేషిస్తున్నారు. మరోపక్క డీఎంకే అధినేత స్టాలిన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

పన్నీర్ నో ఇంట్రెస్ట్...

కాగా, పన్నీర్ సెల్వానికి కీలక పదవి ఇవ్వాలని శశికళ భావిస్తుండగా, తనకు ఎటువంటి పదవులు వద్దని విజ్నప్తి చేస్తున్నాడంట. ఆయనకు నచ్చజెప్పేందుకు శశికళ సీనియర్లను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. తొలుత స్పీకర్ పదవిలో నియమించాలని శశికళ భావించారు. అయితే పాలనపై పట్టున్న ఆయనను అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి దూరం చేస్తే పాలనలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావించిన శశికళ ఉప ముఖ్యమంత్రి, లేదంటే ఆర్థిక, హోం శాఖల్లో ఏదో ఒకటి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అసలు తనకు పదవే వద్దని పన్నీర్ భీష్మించుకుని కూర్చున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

శశికళకు ఏ హక్కు ఉంది: టి. రాజేందర్

సీఎం పదవి చేపట్టేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఏ హక్కు ఉందని ఆల్ ఇండియా లాచియా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏఐఎల్‌డీఎంకే) వ్యవస్థాపకుడు, నటుడు టి.రాజేందర్ మండిపడ్డారు. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లో ఆమె ఏ హక్కుతో ఉంటున్నారని నిలదీశారు. శశికళ ఇలా హడావిడిగా ఎందుకు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. అందులో ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శశికళ సీఎం కావడం ఆ పార్టీలోని వారికే ఇష్టం లేదని పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత పలు సందర్భాల్లో ‘మక్కళాల్ నాన్..మక్కళుక్కాగవే నాన్’ అని చెప్పేవారని గుర్తుచేశారు. అంటే తనకు ఎవరితోనూ ఎలాంటి బంధాలు లేవని దాని అర్థమని వివరించారు. అటువంటప్పుడు జయతో శశికళకు ఎటువంటి సంబంధముందని ప్రశ్నించారు. ఏ హక్కుతో ఆమె పోయెస్ గార్డెన్‌లో ఉంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు. జయలలిత తర్వాత అంతటి అర్హత ఉన్నవారే సీఎం బాధ్యతలు చేపట్టే హక్కు ఉంటుందని రాజేందర్ చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK Chief  Vk Sasikala Natarajan  Swearing-in  Governor VidyaSagar  

Other Articles