బాలకృష్ణ పీఏ శేఖర్ హౌజ్ అరెస్ట్ balakrishna pa shekar in house arrest

Actor balakrishna pa shekar in house arrest

hindupur, ananthapur, pa shekar, house arrest, abusing audio, threatens, contractor, bribes, viral video, social media

Actor turned Politician Hindipur MLA Balakrishna personal assistant shekar had been in house arrest after his threatening audio leaked and gone viral on social media

సినీనటుడు బాలకృష్ణ పీఏ శేఖర్ హౌజ్ అరెస్ట్

Posted: 02/05/2017 03:09 PM IST
Actor balakrishna pa shekar in house arrest

అనంతపురానికి చెందిన కాంట్రాక్టర్ ను చెప్పుతో కోడతా, తాట తీస్తానంటూ బెదిరింపులు, హెచ్చరికలు జారీ చేసిన వీడియో బయటకు రావడం.. అది కాస్తా నెట్ లో వైరల్ గా మారడంతో గత్యంత్యరం లేని పోలీసులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంలో పీఏ శేఖర్‌ను పోలీసులు గృహనిర్భంధంలో వుంచారు. శేఖర్ ను బయటకు వెళ్లనీయకుండా హౌజ్ అరెస్ట్ చేశారు, దీంతో బాలకృష్ణ పీఏ విషయంలో నెలకొన్న వివాదం మరింత చర్చనీయాంశమైంది. అంతేకాదు శేఖర్ అనుచర వర్గం వచ్చి అల్లర్లు చేస్తారమోనని పోలీసులు హిందూపురంలో 144 సెక్షన్ విధించారు.

అయితే శేఖర్ వర్గీయులకు ధీటుగా హిందూపురం టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు కూడా వారితో పోటాపోటీగా ధర్నాలకు, నిరసన కార్యక్రమాలకు దిగవచ్చని, దీంతో శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలగవచ్చునని పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. నిన్నమొన్నటి వరకూ నియోజకవర్గానికి, అనంతపురం జిల్లాకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. దీంతో ఎమ్మెల్యేగా బాలయ్య ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే శేఖర్‌ను దూరం పెట్టడమే శ్రేయస్కరమని బాలకృష్ణ అభిమానులతో సహా శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. పీఏ విషయంలో బాలయ్య మాత్రం ఇంకా తర్జనభర్జనలోనే ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. శేఖర్‌రెడ్డిని తప్పించకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని టీడీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బాలకృష్ణకు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hindupur  ananthapur  pa shekar  house arrest  abusing audio  threatens  contractor  bribes  viral video  social media  

Other Articles