అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు Chandrababu Sensational Comments On Trump

Ap cm chandrababu naidu sensational comments on donald trump

US president, American President, Donald Trump, Andhra Pradesh Chief Minister, Chandrababu

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has ridiculed the government of US ruled by its President Donald Trump.

అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Posted: 02/05/2017 12:40 PM IST
Ap cm chandrababu naidu sensational comments on donald trump

అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి ఎన్నికైన నాటి నుంచి అయకు వ్యతిరేకంగా అనేక గళాలు వినిపిస్తున్నాయి. ఇక లక్షలాధి మంది వీధుల్లోకి వచ్చి అయనకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టారు. ట్రంఫ్ అధ్యక్ష పగ్గాల చేపట్టి పాలన ప్రారంభించినప్పటి నుంచి అమెరికాలో నిరసన జ్వాలలు మరింత పెరిగాయి. దీంతో ట్రంప్ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు అనగానే వారికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి తమ దేశాలకు తీసుకువెళ్లే వారు కాస్తా.. తాజా నిరసనల నేపథ్యంలో ఒకొంత మిమాంసలో పడ్డారు.

గతంలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా వున్న సమయంలో ఆయన దేశ పర్యటనలో భాగంగా భారత్ కు రాగానే సరాసరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక రోజు వున్నారు. దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కని అవకాశాన్ని దక్కించుకున్నారు అప్పట్లో చంద్రబాబు. అయితే క్లింటన్ హైదరాబాద్ నగర పర్యటన సందర్భంగా అప్రకటిత కర్వ్యూ విధించారిన కూడా అప్పట్లో విమర్శలను ఎదుర్కోన్నారు. అయితే తాజాగా చంద్రబాబు కూడా ట్రంప్ అనగానే చటుక్కున ఓ వ్యంగస్త్రాన్ని సంధించారు. ట్రంప్ ను చంద్రబాబు ఏమని అన్నారో తెలుసా..?

ఒక వ్యక్తి వ్యవహార శైలితో దేశం నాశనమవుతోందనే దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ విధానాలతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోందని, ఆ విధానాలకు వ్యతిరేకంగా మన తెలుగు వాళ్లు కూడా పోరాడుతున్నారని అన్నారు. అమెరికాలో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుందని, ఆ దేశంలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే ఉంటారని అన్నారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని, ప్రభుత్వ ఉద్యోగమే గొప్ప అనే పరిస్థితులు ఇప్పుడు లేవని చంద్రబాబు  అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles