అధికార ఎంపీ కూతురుక.. చుక్కలు చూపిన పోలీసులు..! ruling mp's dauther been ignored by police

Opposition mla gives support to ruling mp s dauther

MP shiva prasad, tirupati mp, chandragiri mla chevireddy, excise assitant commissioner, doctero madhavi latha, narender reddy, andhra pradesh, chandrababu, telugu desam

chandragiri ysrcp mla chevireddy bhaskar reddy supports ruling tdp mp shiva prasad's daughter doctor madhavi latha in tirupathi road rage inncident.

అధికార ఎంపీ కూతురుకి ప్రతిపక్ష ఎమ్మెల్యే మద్దతు..!

Posted: 02/04/2017 11:55 AM IST
Opposition mla gives support to ruling mp s dauther

రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు, విఫక్ష పార్టీ నేతలకు మధ్య పచ్చగడ్డి వేసినా కూడా మండుతుందన్న విషయం ప్రజలకు తెలిసిందే. కానీ అధికార పక్షానికి చెందిన ఎార్లమెంటు సభ్యుడి కూతరుకి జరిగిన పరాభవ ఘటనలో మాత్రం నేతలు ఒక్కతాటిపైకి వచ్చారు. అంతేకాదు.. రాజకీయ నేతలు ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లి ఐదు గంటల పాటు నిరసన వ్యక్తం చేసినా.. పోలీసులు మాత్రం వారిని పట్టించుకోలేదు. ఒక పోలీసు అధికారి బంధవును రక్షించడానికి వారు ఎంతగా ప్రయత్నించాలో అంతకన్నా ఎక్కువే జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధుల డిమాండ్ కన్నా శాంతిభద్రతలే ముఖ్యమని చెప్పకనే చెబుతూ.. నిందితులడ్ని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ కుమార్తె డాక్టర్‌ మాధవీలత తన కారులో రెడ్డి అండ్‌ రెడ్డి కాలనీలో వస్తుండగా, ముందు వాహనం ఆగి ఉండటంతో హారన్‌ కొట్టారు. దీంతో ఆవేశంగా వచ్చిన నరేంద్రరెడ్డి అలియాస్‌ దీపు ఎంపీ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. తాను ఎంపీ కుమార్తెనంటూ మాధవీలత అడ్డుకోబోగా వినకుండా కులంపేరుతో దూషించాడు. స్థానికులు జోక్యం చేసుకుని దీపును పంపేశారు. కారు నెంబరు ప్రకారం చంద్రగిరి వద్ద దీపును చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు ఇక్కడ్నుంచి కదిలేదిలేదని మాధవీలత రోడ్డుపైనే బైఠాయించారు.
 
విషయం తెలుసుకున్న చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాధవీలత కు మద్దతుగా ఘటనాస్థలానికి వచ్చారు. ఆయన కూడా బాధితురాలితో కలసి రో్డుపై బైఠాయించారు. పార్లమెంటుసభ్యుడు శివప్రాద్ కూతురి విషయంలోనే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో అర్థమవుతుందని అయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటనలో ఊదరగోట్టిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదని చెవిరెడ్డి దుయ్యబట్టారు.  

బాధితురాలు మాధవీలత మీడియాతో మాట్లాడుతూ.. అడ్డుగా ఉన్న వాహనాన్ని చూసి హారన్‌ కొట్టినందుకు దీపు అనే వ్యక్తి తన కారు డ్రైవర్‌ ఆంజనేయులుపై దాడికి దిగారన్నారు. అడ్డొచ్చిన తనపైనా దురుసుగా వ్యవహరిస్తూ కులం పేరిట దూషించినట్లు చెప్పారు. అతడి మేనమామ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కావడంతో క్షమాపణ చెప్పించకుండా చేస్తున్నారన్నారు. తమపై దాడిచేసేటప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నారన్నారు. నిందితుడితో క్షమాపణ చెప్పించాలని దాదాపు 5 గంటలు పాటు రోడ్డుపైనే భైఠాయించినా.. వారి అవేదన తీరలేదు. చివరకు పోలీసులు వచ్చి వారిని సముదాయించి పంపించివేశారు.

తన కుమార్తెకే కాదు ఏ మహిళకైనా ఇలాంటి అవమానం జరిగినప్పుడు నిందితుడితో క్షమాపణలు చెప్పించలేని పోలీస్‌ అధికారుల వల్ల సమాజానికి ఏమీ ఒరగదని పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ అన్నారు. దురుసు మనస్తత్వం గల యువకులు నలుగురిలో క్షమాఫణలు చెబితేనే వారికి అహం దెబ్బతిని.. సన్మార్గంలో నడిచేందుకు అవకాశం వుంటుందన్నారు. లేకపోతే ఈ ఘటనను కూడా వారు తాము సాధించి విజయంగా చెప్పుకుని భవిష్యత్తులో మరింత రెచ్చిపోయే ప్రమాదముందని అన్నారు.  రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని కోరితే.. స్టేషన్‌కు వచ్చి నిందితుడిని గుర్తుపట్టమని పోలీసులు చెప్పడం విచారకరం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles