ఫేస్ బుక్ ప్రేయసితో తెగ ఎంజాయ్ చేశాడు.. గుర్తుగా ఏం చేశాడో తెలుసా? | Man kills live-in partner entombs body.

Bhopal man murders live in partner buries body

Bhopal man, Buried Inside The House, Man Murders Live-in Partner, Marble Tomb for Lover, Online Lover Kill, Bengal girl Murder, Akansha Sharma, Akansha Sharma Udayan Das, Udayan Das Murder, India Greatest Lover, Facebook Love, Facebook Friendship Murder, Online Lover Murder

Live-In Boyfriend Strangles His Girl friend To Death And Buries Her With Cement Inside His Own House. Sharma , a resident of Bankura in West Bengal, met Das on a social media site in 2007 and left her home in June last, telling her parents she had got a job in New York. But, she came to Bhopal and started living with Das.One day he killed her in anger a month ago while they had a verbal fight. Later buried inside the house. 'Dhrishyam' Movie gave him idea of how to dispose of body.

ప్రేయసి కోసం ఏం కట్టాడో తెలుసా?

Posted: 02/04/2017 11:22 AM IST
Bhopal man murders live in partner buries body

లివింగ్ రిలేషన్ షిప్ ల పేరుతో నేటి యువత చేస్తున్న ప్రయత్నాలు చివరకు తప్పటడుగులుగా మిగులుతున్నాయి. తాజాగా భోపాల్ లో వెలుగుచూసిన ఓ ఉదంతం కలకలం రేపింది. తల్లిదండ్రులకు తెలీకుండా ఓ యువతి చేసిన పని చివరకు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అందుకు కారణం ఆ యువతి గాఢంగా ప్రేమించిన యువకుడే.

పశ్చిమబెంగాల్ కు చెందిన ఆకాంక్ష శర్మ అనే యువతి ఆన్ లైన్ లో భోపాల్ కు చెందిన ఉదయ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అది కాస్త ప్రేమగా మారి ముదిరింది. దీంతో ఎలాగైనా అతనితో కలిసి జీవించాలనుకున్న ఆ యువతి అమెరికా వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి, భోపాల్ లో ప్రియుడి వద్దకు చెక్కేసింది. ఇద్దరు కలిసి ఆరునెలలు హాయిగా జీవించారు. ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఫోన్ లో ఆకాంక్ష బాగానే మానేజ్ చేసింది. అయితే నెలరోజులుగా ఆమె నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ లేకపోవటంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయం వెలుగుచూసింది.

నెలరోజుల క్రితం ఇద్దరి మధ్య ఓ చిన్నవాదులాట జరగ్గా, ఆ కోపంతో తనని హత్య చేశానని ఉదయ్ వెల్లడించాడు. అంతేకాదు ఆమెను ఓ చెక్క బాక్స్ లో పెట్టి తన ఇంట్లోనే పాతిపెట్టాడు కూడా. ఆపై సమాధిపైనే పరుపు వేసుకుని పడుకుంటున్నాడంట. దృశ్యం సినిమా ఇన్సిపిరేషన్ తోనే తాను ఈ పనిచేశానని చెప్పటం విశేషం. దీంతో మూడు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు ఉదయ్ ను కటకటాల వెనక్కి పంపారు. ఆన్ లైన్ పరిచయాలు ఎంత దారుణాలను దారితీస్తాయో ఈ ఉదంతం మరోసారి నిరూపించినట్లయ్యింది.

Bhopal Man Buried Lover

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  Love  Udayan Das  Akansha Sharma  Bengal  Bhopal  Muder  

Other Articles