రైలుకు ఎదురుగా ట్రాకుపై నడిచి వెళ్లిన మహిళ.. Train halts inches away from woman walking on track

Train halts inches away from woman walking on track

Western Railway, Santosh Kumar Gautam, Grant Road station, women crosses train tracks, motorman, Charni Road, alert motorman, viral video

The incident, captured by commuters standing on a platform at Charni Road station, has since gone viral; Western Railway to felicitate the alert motorman for saving her life.

ITEMVIDEOS: రైలుకు ఎదురుగా ట్రాకుపై నడిచి వెళ్లిన మహిళ..

Posted: 02/03/2017 01:48 PM IST
Train halts inches away from woman walking on track

రైల్వే ట్రాకుపై నడవరాదని, అటు నుంచి ఇటు ఫ్లాట్ ఫాంలపైకి చేరాలన్నా తప్పక మెట్లదారిని వినియోగించాలని ప్రతీ రైల్వే స్టేషన్ లో అధికారులు బోర్డులను పెట్టి మరీ సూచిస్తుంటారు. అలా ట్రాకులపై నడవటం ప్రమాదకరమని, అంతేకాదు అది చట్టరిత్యా నేరమని కూడా బొర్డులు దర్శనమిస్తుంటాయి. కానీ ఆ బోర్డులపై రాసివున్నదేంటన్న విషయం మాత్రం కేవలం అక్షరాస్యులకు మాత్రమే తెలుసు. నిరక్షరాస్యులకు ఏం తెలుసు. పలు సందర్భాలలో అక్షరాస్యులు కూడా ఈ తప్పిదాలను చేస్తుంటారు. అయితే ఇలా ట్రాకులు దాటే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకున్న సందర్భాలు మాత్రం అరుదు.

అయితే చెత్త సేకరించే ఓ మహిళ చార్నీ రైల్వే స్టేషన్ వద్ద ట్రాకుపై పరద్యానంగా నడుస్తూ చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న ఓ పాస్ట్ ప్యాసెంజర్ రైలుకు ఎదురుగా వెళ్లింది. అమెను దూరం నుంచే గమనించిన రైలు డ్రైవర్ (లోకో పైలెట్) అదేపనిగా హరన్ ఇచ్చినా.. అమె అలానే నడిచింది. దీంతో అమెను రక్షించేందుకు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలును డ్రైవర్ నిలిపేశాడు. కాగా వేగంతో వెళ్తున్న రైలు చివరాఖరున అమెకు కొన్ని ఇంచుల దూరంలోకి వెళ్లి అగింది.

వెంటనే తన క్యాబిన్ దిగిన రైలు డ్రైవర్ సంతోష్ కుమార్ గౌతమ్.. పక్కనున్న బోగిలోకి వెళ్లి రైలు ప్యాసెంజర్లకు విషయాన్ని తెలిపి.. అమెను పక్కను జరపాలని కోరాడు. రైలు సమీపించడంతో అమె ఫ్లాట్ ఫాం పైకి ఎక్కాలని ప్రయత్నించినా.. ఫ్లాట్ ఫామ్ చాలా ఎత్తుగా వుండటం వల్ల అమెకు అది సాధ్యపడలేదు. దీంతో అమె వద్దకు చేరకున్న ప్రయాణికులు అమెను ఫ్లాట్ ఫాం ఎక్కేందుకు సాయం చేశారు. కాగా ఓ ప్రాణాన్ని కాపాడిన గౌతమ్ ను పశ్చిమ డివిజన్ అధికారులు సన్మానించనున్నారు. కాగా పలువురు ప్రయాణికులు తమ సెల్ ఫోన్ లలో ఆ సన్నివేశాలను చిత్రీకరించి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles