అమరావతి రైతులకు ఆర్థిక మంత్రి శుభవార్త Arun Jaitley good news to amaravati farmers in Budget

Arun jaitley good news to amaravati farmers in budget

PM modi, narendra modi, arun jaitley, amaravathi, andhra pradesh, land pulling, tax exemtion, demonetisation, Budget, finance minister, nda government, budget 2017-18, Union Budget 2017, financial year budget, congress, mallikarjun kharge, parliament

Finance Minister Arun Jaitley announces good news to Andhra pradesh capital farmers, who gave their land for construction of capital Amaravati, in the Budget for 2017-18.

అమరావతి రైతులకు ఆర్థిక మంత్రి శుభవార్త

Posted: 02/01/2017 07:34 PM IST
Arun jaitley good news to amaravati farmers in budget

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుభవార్త చెప్పారు. అమరావతి ప్రాంతంలో ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం అత్యంత వినూత్నంగా భూసమీకరణ జరిగిందని జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. రాజధాని రైతులు తమ వాటాగా పొందే వాణిజ్య, నివాస ప్లాట్లను తొలిసారి విక్రయించగా వచ్చే సొమ్ముపై పన్ను (క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌) మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.
 
భూసమీకరణలో తమ పొలాలు ఇచ్చిన వారికి... రాష్ట్ర ప్రభుత్వం మెట్టకు ఎకరానికి వెయ్యి గజాల రెసిడెన్షియల్‌ ప్లాటు, 250 గజాలు వాణిజ్య ప్లాటు కేటాయించింది. అదే జరీబు భూములు ఇచ్చిన వారికి వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్‌ ప్లాటు ఇస్తోంది. రాజధాని రాకతో స్థలాల విలువ భారీగా పెరుగుతుందని, తమ వాటా ప్లాట్లు విక్రయించుకోవడం ద్వారా రైతులకు భారీ లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే... ఈ ప్లాట్ల తొలిసారి విక్రయం ద్వారా వచ్చిన డబ్బుపై క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను మినహాయిస్తున్నట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles