ఒకసారి వదిలివెళ్తే అమెరికాలోకి తిరిగి అనుమతి లేదా?, పాక్ పై కూడా నిషేధం | Criticism on Trump's travel ban.

Donald trump says immigration move not a muslim ban

America Immigration Move, Trump's Travel Ban, Donald Trump Muslim ban, US Immigration Executive Order, Muslim ban Donald Trump, Dual Citizenship Britain America, Seven Muslim Countries, America Islam Ban, Donald Trump Islam Ban

Donald Trump says Immigration move not a Muslim ban. US will resume issuing visas to all countries over next 90 days. Ban is about terror not religion. Dual citizenship Britons exempted. The US president had decided to ban nationals from seven Muslim-majority countries from entering America.

అది ముస్లింలపై బ్యాన్ కానే కాదు

Posted: 01/30/2017 09:44 AM IST
Donald trump says immigration move not a muslim ban

ముస్లిం ఉగ్రవాదం, వలసవాదాలను ఆపాలన్నది ట్రంప్ హామీల్లో ముఖ్యమైనవని, ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వారికి మాత్రమే దక్కాలన్నది కూడా మరో కీలక హామీఅని గుర్తు చేసిన ప్రెస్ సెక్రటరీ, హామీలన్నీ అమలు చేసి తీరుతామని తెలిపాడు. తమ భూభాగం నుంచి ఉగ్ర శిబిరాలను సమూలంగా నాశనం చేసేందుకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలన్నది ట్రంప్ అభిమతమని వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అణగదొక్కుతామని స్పష్టం చేశారు.

ఆదేశాల్లో ఏముంది...
ముస్లిం ఆధిక్య దేశాలైన ఇరాన్ , ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్ , సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాలోకి వలసలు రాకుండా 90 రోజులు నిషేధం విధిస్తూ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. మరోవైపు ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిన పాకిస్థాన్ పై కూడా నిషేధం విధించే ఆలోచన ఉందని ట్రంప్ స్వయంగా తెలపటం విశేషం. ఈ నిర్ణయంతో ఏడు దేశాలకు చెందిన విద్యార్థి, ఉద్యోగ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారే కాకుండా 5 లక్షల మంది గ్రీన్ కార్డుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకసారి దేశం వదిలివెళ్తే అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకునేలా ట్రంప్‌ ఉత్తర్వులున్నాయని, దౌత్య వీసాలు ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని హోం ల్యాండ్‌ విభాగం చెబుతోంది.

ఇక ఏడు ముస్లిం దేశాల నుంచి పౌరులు రాకుండా అడ్డుకునేలా దేశాధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న ఆయా దేశాల వారి గుండెల్లో గుబులు రేపుతోంది. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ‘ఈ నిర్ణయం ప్రకారం తాత్కాలికంగా విదేశీ పర్యటనకు వెళ్లిన వారు అమెరికాకు తిరిగి రావడం కష్టం... విద్యార్థి శీతాకాల సెలవుపై స్వదేశానికి వెళ్తే అమెరికా రావడం కుదరదు’ అని న్యాయ నిపుణుడు లెగోంస్కీ పేర్కొన్నారు.

అంతేకాదు ట్రంప్‌ నిర్ణయంతో పలు కుటుంబాలు విడిపోవడమే కాకుండా, కొడుకు పెళ్లికి తల్లిదండ్రులు వెళ్లలేని పరిస్థితి. కొత్తగా పెళ్లైన దంపతులకు వివాహ వీసా రద్దు కావడంతో వారు విడిగా ఉండాల్సిందే... ఇరాన్ నుంచి అమెరికా వెళ్తోన్న పలువురిని విమనాశ్రయాల్లోనే అడ్డుకున్నారు. ప్రపంచ దేశాధినేతల ఖండన.. ట్రంప్‌ నిర్ణయాన్ని ప్రపంచ దేశాధినేతలు తప్పుపట్టారు. ఉగ్రవాదంపై పోరు అత్యంత అవశ్యకమైనా సరే... ఒక జాతికి, విశ్వాసానికి చెందిన ప్రజల్ని సందేహించడం సరికాదని జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ తప్పుపట్టారు. ద్వంద్వ పౌరసత్వం ఉన్న జర్మనీ ప్రజలపై ట్రంప్‌ నిర్ణయ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామన్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని అంగీకరించమని బ్రిటన్ ప్రధాని థెరెసా మే అన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆదివారం 30 ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. అధ్యక్షుడి నిరంకుశ డిక్రీని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఫ్లకార్డలతో నిరసన తెలిపారు.

మనం చాలా కఠినమైన నిషేధాన్ని అమలు చేస్తున్నాం. క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నాం... ఎన్నో ఏళ్ల నుంచి ఇలా చేసి ఉండాల్సింది’ అని నిర్ణయం తర్వాత ట్రంప్ ప్రకటించాడు. ఇది కేవలం ముస్లింలపై నిషేధం కాదన్నారు. కార్యనిర్వాహక ఉత్తర్వులు (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌) అంటే ముస్లింలపై నిషేధం విధించినట్టు కానేకాదు. ఉత్తర్వుల సారాంశాన్ని మీడియా వక్రీకరించింది. నిజానికి ఈ ఉత్తర్వులు మత సంబంధమైనవి కావు. అమెరికన్ల భద్రత, ఉగ్రవాదం అంశాలనే ప్రాతిపదికగా తీసుకున్నాం. ‘అమెరికా ఫస్ట్‌’ అనేది మా విధానం. అమెరికన్ల భద్రత విషయంలో రాజీపడేది లేదు. అయినా, ఆ ఏడు దేశాలను మినహాయిస్తే, ప్రపంచంలో ముస్లిం మెజారిటీ ఉన్న దాదాపు 40 దేశాలకు మా నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. 90 రోజుల్లో వీసాల జారీ ప్రక్రియను మరింత పకడ్బందీ చేస్తాం. అప్పుడు అన్ని దేశాలకు చెందిన పౌరులను అమెరికాలోకి ఆహ్వానిస్తాం’ అని ట్రంప్‌ వివరణ ఇచ్చుకున్నాడు. ఐసిస్‌ను ఓడించేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని 30 రోజుల్లోపు రచించాలని ట్రంప్‌ సైనిక విభాగాన్ని ఆదేశించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Immigration Move  Muslim Countries Ban  America  

Other Articles