ట్రంప్ అలా చెప్పి.. ఇలా మొదలుపెట్టేశాడు.. 41 మంది మృతి | First military operation OK'd by Trump.

Us elite forces in deadly raid on al qaeda in yemen

US special forces, Iraq-Yemen War, America Yemen Attack, Donald Trump Terrorists, Trump First Military Operation, Trump on Terrorism, Donald Trump Al Qaeda, Yemen Al Qaeda

US special forces deadly raid On Al Qaeda In Yemen, 41 Al-Qaeda suspects, 8 civilians and 1 Service Member Killed.

ట్రంప్ దండయాత్ర మొదలుపెట్టాడు

Posted: 01/30/2017 09:14 AM IST
Us elite forces in deadly raid on al qaeda in yemen

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బలగాలు తమ వేటను ప్రారంభించాయి. ఆదివారం యెమ‌న్‌లో యూఎస్ బ‌ల‌గాలు జ‌రిపిన దాడుల్లో 57 మంది దుర్మరణం పాలయ్యారు. ఉగ్రసంస్థ అల్‌ఖైదాను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగాయి. 41 మంది అనుమానిత ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం.

య‌క్లా జిల్లాలో బైదా ప్రావిన్స్‌లో వారు సమావేశం అయ్యారని సమాచారం అందుకుని ఈ దాడులు నిర్వహించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. దాడుల్లో 16 మంది సాధారణ పౌరులు (8 మ‌హిళ‌లు, ఎనిమిదిమంది చిన్నారులు) కూడా చనిపోయినట్లు వెల్లడించారు. అల్‌ఖాయిదా నిర్వ‌హిస్తున్న స్కూళ్లు, మ‌సీదులు, వైద్య ప్రాంతాల్లో ఈ దాడులు జ‌రిగిన‌ట్టు పేర్కొన్నాయి. దాడుల్లో అల్‌ఖాయిదా ఈ ప్రాంత చీఫ్ అబు బ‌రాజ‌న్ కూడా మృతి చెందిన‌ట్టు అధికారులు తెలిపారు.

US Forces Yemen Attack

మరోవైపు త‌మ సైన్యం తరపు నుంచి ఒక‌రు మృతి చెందిన‌ట్టు అమెరికా పేర్కొంది. గ‌త 24 గంట‌ల్లో వంద మంది రెబ‌ల్స్‌ను మ‌ట్టుబెట్టిన‌ట్టు యెమ‌న్ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. కాగా, యెమెన్ లో తిష్ట వేసిన రెబల్స్ గ్రూపులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటంతోపాటు, మార్చి 2015 నుంచి 7 వేల మందిని పొట్టనపెట్టుకున్నారు. తాను అధికారంలోకి రాగానే ఉగ్ర మూకలను ఉనికి లేకుండా చేస్తానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US special forces  Yemen  Al Qaeda  Attack  

Other Articles