పవన్ అవేదన.. వెంకయ్యకు అలా అర్థమైందా..! venkaiah naidu responds to pawan kalyan comments

Venkaiah naidu responds to pawan kalyan comments

pawan kalyan, janasena, venkaiah naidu, union minister, bjp, chandrababu, andhra pradesh special status, rk beach protest, ap police, vishakapatnam, andhra pradesh

union minister venkaiah naidu responds to the comments made by janasena chief pawan kalyan on supressing agitaion on andhra pradesh special status

పవన్ అవేదన.. వెంకయ్యకు అలా అర్థమైందా..!

Posted: 01/28/2017 01:37 PM IST
Venkaiah naidu responds to pawan kalyan comments

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించిన పార్టీలో మాట మార్చడంతో పాటు.. ప్రత్యేక హోదా విషయమై విశాఖపట్నం అర్కే బీచ్ లో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన రాష్ట్ర యువతను అడ్డుకుని, నిరసనలు తెలిపే అవకాశం ఇవ్వకుండా అణిచివేసిన ధోరణిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ క్రితం రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. అయితే దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు.

పవన్ కల్యాన్ పేరును ప్రస్తావించకుండా, పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వెంకయ్య. ఉత్తారది అదిపత్యం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు నోచ్చుకున్నారేమో తెలియదు కానీ.. ఉత్తరాది అధిపత్యం అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని వాటిని ఖండించారు. ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు. నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిందని పవన్‌కు పరోక్షంగా సూచించారు.

కాగా, పవప్ కల్యాన్ ప్రస్తావించిన ప్రత్యేక హోదా అంశంపై కానీ, లేదా విశాఖలోని అర్కే బీచ్ లో నిరసన తెలిపే కార్యక్రమంపై కానీ మాటా కూడా మాట్లాడని వెంకయ్య.. ఉత్తరాది పెత్తనం అనగానే మాత్రం.. దానిని ఖండించారు. పనిలో పనిగా అటు సీనీనటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు వెంకయ్య. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపి ఓటమిని చవిచూస్తుందని జోస్యం చెప్పారని, ఫలితాలు రాగానే ఎవరె పోతారో.. ఎవరు గెలుస్తారో అప్పుడే తేలిపోతుందని వెంకయ్య అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh