ప్రధానిలా ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తా.. Joined politics to make money and fool people: Agra poll candidate

Shocking joined politics only to make money and fool people asserts agra poll candidate

UP elections, Uttar Pradesh Assembly Elections 2017, UP polls 2017, Gopal Choudhary

Gopal Chaudhary, who is all set to contest the upcoming assembly polls as an independent candidate from the Agra South constituency here, says that his only purpose of joining politics is to make money and fool people.

ITEMVIDEOS: ప్రధానిలా ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తా..

Posted: 01/28/2017 11:48 AM IST
Shocking joined politics only to make money and fool people asserts agra poll candidate

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిధశకు ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు.. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్న క్రమంలో.. పాపులారిటీ ద్వారానే ఓట్లు పడతాయని తెలుసుకున్న ఓ అబ్యర్థి సంచలన వ్యాఖ్యలు చేసి ఓటర్లను అకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆగ్రా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా  పోటిస్తున్న వ్యక్తి చౌదరి షాకింగ్ ప్రచారంతో వెలుగులోకి వచ్చారు. తాను డబ్బుకోసమే  రాజకీయాల్లోకి వచ్చానంటూ బహిరంగంగా  ప్రకటించుకోవడం  సంచలనంగా మారింది. ఈ అభ్యర్థి చేస్తున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్  అయింది.

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అన్న మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. ఒకటి డబ్బు సంపాదించడం, రెండవది ప్రజల్ని ఫూల్స్ చేయడం అని కుండబద్దలు కోట్టినట్టు చేప్పేశాడు. దాదాపు అందరూ రాజకీయాల్లోకి  పరోక్షంగా ఇదే ఉద్దేశంతో వస్తున్నారని కూడా చౌదరి వ్యాఖ్య‌లు చేశారు. ఒకటవ కారణం కరెక్టే కానీ రెండవ కారణంపై క్లారిటీ ఇవ్వగలరా అన్న మీడియా ప్రశ్నలకు మరో అడుగు ముందుకేసిన చౌదరి ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

ప్రజల్ని అవివేకుల్ని చేసి ఒక వ్యక్తి దేశాన్నే ఏలుతున్నాడని, అలాంటప్పుడు తాను మాత్రం ఏం తక్కువ అని, తాను కూడా ప్రజలన్ని ఫూల్స్ చేసి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను అవివేకుల‌ని చేసిన ఎవరైనా ప్రధాని అయిపోవ‌చ్చని, అందుకోసం కాసింత నైపుణ్యం ఉండాలని ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే అలా అని అందరూ ప్రధానులు కాలేరని, దానికి కొంత టాలెంట్ కూడా అవసరమని చౌదరి చెప్పుకోచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles