హోదా పోరు: పోలీసు పహారా నడుమ స్టీల్ సిటీ.. అప్రకటిత ఎమర్జెన్సీ.! with police checks, emergency situation prevails in vizag

With police checks emergency situation prevails in vizag

jallikattu, ordinance, state government, central government, jana sena, YSRCP, desh bachvo, tollywood, chandrababu, special status, vizag, rk beach

police check snuffed, Actor turned politician janasena chief pawan kalyan desh bachavo call and ycp president ys jagan call for ap special status in vizag rk beach.

హోదా పోరు: పోలీసు పహారా నడుమ స్టీల్ సిటీ.. అప్రకటిత ఎమర్జెన్సీ.!

Posted: 01/26/2017 10:09 AM IST
With police checks emergency situation prevails in vizag

ప్రత్యేక హోదా ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో విశాఖపట్నంలోని అర్కే బీచ్ తో పాటుగా దానికి దారి తీసే దారులన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బీచ్ కు వెళ్లే దారులన్నింటిలో పోలీసు చెక్ పోస్టులతో.. అప్రకటిత కర్ప్యూ, సహా అప్రకటిత ఎమర్జెనీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా సాధన కోసం అటు జనసేన పార్టీ, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలతో పాటు కాంగ్రెస్, వామపక్షాల మద్దతుకు కూడా ప్రకటించాయి, దీనికి తోడు టాలీవుడ్ ప్రముఖ నటులు, ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించిన తరుణంలో ఎక్కడికక్కడ నిరసన తెలిపేందుకు వచ్చిన నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

విశాఖలోని అర్కే బీచ్ వెళ్లే దారుల్లో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ప్రత్యేక హోదా ఆందోళన కేంద్రమైన బీచ్‌రోడ్డులోకి వెళ్లకుండా పూర్తిగా పోలీసుల వలయాన్ని మోహరించారు. బీచ్‌ రోడ్డుకు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నగరంలో 144 సెక్షన్‌ విధించి భారీగా బలగాలను దించారు. మరోవైపు పోలీసుల వలయాన్ని చేధించుకుని అందోళనలో పాల్గోనేందుకు యువత ముందుకువస్తూ నిరసనలతో రోడ్డలపైనే బైఠాయిస్తున్నారు. అయితే రోడ్డుపైన నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతించకుండా వారిని అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు.

జల్లికట్టు క్రీడ కోసం తమిళ యువత జరిపిన ఆందోళన స్ఫూర్తిగా ప్రత్యేక హోదా ఆందోళనలకు వైజాగ్‌ బీచ్‌రోడ్డులో యువత, ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమౌవుతున్నా.. పోలీసులు మాత్రం శాంతియుతంగా నిరసనకు దిగిన అందోళనకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితు దేశ్ బచావో పిలుపు మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైజాగ్ కు వచ్చిన అనేక మందిని రైల్వే ష్టేషన్లలోనూ, బస్ స్టేషన్లలోనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. హోదా పోరాటానికి వస్తున్న యువతను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles