ఈ లెఫ్టెనెంట్ గవర్నర్ మాకోద్దు బాబాయ్.. Congress demands resolution seeking recall of LG

Congress demands resolution seeking recall of lg

V Narayanasamy, National Green Tribunal, Lt Governor, Kiran Bedi, Congress party, DMK legislators, BJP, PM Modi

The puducherry government used the floor of the Legislative Assembly to rail against Lt. Governor Kiran Bedi and press for her recall for “working against the interest of the government and elected representatives.”

ఈ లెఫ్టెనెంట్ గవర్నర్ మాకోద్దు బాబాయ్..

Posted: 01/25/2017 12:09 PM IST
Congress demands resolution seeking recall of lg

దేశ రాజధాని ఢిల్లీలో అధికార అరవిద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ లకు మధ్య ఉవ్వెత్తున్న రేగిన ప్రకంపనలు గవర్నర్ నజీబ్ జంగ్ తన పదవికి రాజీనామా చేయడంతో సద్దుమణుగగా, ఇప్పుడు అదే స్థాయిలో పుదుచ్చెరీలో కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య విభేధాలు మొదలయ్యాయి. అధికారిక ప్రభుత్వంపై తన హుకుం చెలాయించాలని ఒకరు.. ప్రజల మద్దతుతో వచ్చిన తమపై ప్రజలకే హుకుం చెలాయించే అవకాశం వుంటుందని మరోకరు పట్టువిడువులకు పోకపోవడంతో.. పుదుచ్చేరిలో కూడా రగడ రాజుకుంది. అది క్రమంగా పెరుగుతూ ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయికి చేరింది. ఎంతవరకు అంటే అనవాయితీని కూడా బ్రేక్ పడే స్థాయికి చేరింది.

ఏ రాష్ట్రమైనా, లేక కేంద్ర పాలిత ప్రాంతమైన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ప్రారంభోపన్యాసం చేయడం అనవాయితి. అయితే ఆ అనవాయితీని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి బ్రేక్ చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీకి బదులుగా తాను అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో తొలి ప్రసంగం చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రసంగంతో మొదలుకావాల్సిన అసెంబ్లీని, తన ప్రసంగంతో ప్రారంభించడంతో కిరణ్ బేడీకి దక్కాల్సిన అవకాశం కోల్పోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ప్రారంభ సమావేశాలలో తాను తొలి ప్రసంగం చేసేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ వైద్యలింగంకు కిరణ్‌బేడీ లేఖ రాసినా ఫలితం శూన్యం. దీంతో కిరణ్ బేడికీ ఇది ఒకలాంటి ఎదురుదెబ్బని చెప్పక తప్పదు. ఇక దీనికి తోడు ఈ గవర్నర్ మాకోద్దు బాబోయ్ అంటూ పుదుచ్చేరి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి కూడా పంపనుందని సమాచారం

పుదుచ్చేరిలో అధికారంపై పైచేయి సాధించడంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి, సీఎంల మధ్య సమరం సాగుతున్న దీంతో తారాస్థాయికి చేరింది. అయితే ప్రభుత్వంపై అధిపత్యం చేయబోయి పరాభవం పాలు కావడం కంటే.. ప్రభుత్వంతో సక్యతతో వుంటూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను మాత్రమే అమె వ్యతిరేకించి వుంటే పరిస్థితులు మరోలా వుండేవన్న సూచనలు తెరపైకి వస్తున్నాయి. ఇక దీనికి తోడు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి కేంద్ర పాలిత ప్రాంతాలపై తమ అధిపత్యాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ లతో చాటుకునే పనులు ఆయా ప్రాంతాల ప్రజలకు వ్యతిరేకంగా వున్నాయన్న అరోపనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles