ఆ చింత పులుపుపై పడిన కారం.. తేల్చుకుందాం..రా.. అని సవాల్ TDP minister fires on own party denduluru mla chintamaneni prabhakar

Tdp minister fires on own party denduluru mla chintamaneni prabhakar

Andhra Pradesh minister, peethala sujatha, mla chintamaneni prabhakar, TDP Coordination Committee Meeting, minister challanges chintamaneni, cold war in TDP, denduluru mla

Andhra Pradesh women anc child welfare minister pithala sujatha fires on own party whip and denduluru mla chintamaneni prabhakar in a party meet, where she dares to challenge him.

ఆ చింత పులుపుపై పడిన కారం.. తేల్చుకుందాం..రా.. అని సవాల్

Posted: 01/25/2017 11:26 AM IST
Tdp minister fires on own party denduluru mla chintamaneni prabhakar

తమ పార్టీ క్రమశిక్షణకు అలవాలమైనదని.. ఏ స్టేజీ ఎక్కినా.. ఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా.. పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా.. ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నొక్కొ చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వున్నాయని చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా పార్టీ విఫ్, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ విషయంలో పార్టీ అప్రతిష్టను మూటగట్టుకుంటున్నా.. పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు మాత్రం తమకు పట్టనట్లు వుంటున్నాయన్న అరోపణలు వినబడుతున్నాయి.

ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటన నుంచి చింతమనేనిని గత మూడేళ్లుగా అనేక వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు అడ్డూ అదుపు లేదని భావించి దూకుడు స్వభావంతో నా దారి నాదే అంటూ పయనిస్తున్న చింతమనేనికి పిలుపుపై కారం పడింది. దూకుడుగా సాగుతున్న ఆయనపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రా తేల్చుకుందా అంటూ సవాల్ విసిరారు.

ప్రభుత్వ అధికారులపై ప్రతాపాన్ని చూపినట్టు పార్టీ కార్యకర్తలు, శ్రేణులపై ప్రతాపం చూపితే సహించమని పశ్చిమ గోదావరి టీడీపీ నేతలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన తరువాత.. మళ్లీ పార్టీకి చెందిన మంత్రి ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేంటో తెలుసా..? మంత్రికి ఏ మాత్రం సమాచారం లేకుండా ఏకంగా మంత్రి నియోజకవర్గంలోకి వెళ్లి పలు కార్యక్రమాలలో పాల్గోన్నారట చింతమనేని.

‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తావా.. రా తేల్చుకుందాం. అయినా నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏంటి’ అంటూ మంత్రి.. చింతమనేని ప్రభాకర్‌పై ఫైర్‌ అయ్యారు. ఏలూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఒక సినిమా థియేటర్‌ ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే అయిన పీతల సుజాతను పిలవకుండా, విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను పిలిచారు. దీనికి చింతమనేని హాజరయ్యారు.

తనను ఆహ్వానించటంతో వెళ్లానని, దీనికి మంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని చింతమనేని  ప్రశ్నించినట్టు తెలిసింది. తనకు ఆహ్వానం లేనిచోట మరొకరు వచ్చి పాల్గొనడం ఎంతవరకూ సమంజసమని పీతల సుజాత ప్రశ్నించగా.. చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని, తనను పిలిస్తే  ఎక్కడికైనా వెళ్తానని చింతమనేని సమాధానం చెప్పినట్టు భోగట్టా. దీంతో మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రా తేల్చుకుందాం. ఎస్సీ నియోజకవర్గం అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’ అని సీరియస్‌గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా వేరే నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని హితవు పలికడంతో ఇద్దరు శాంతించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh