రెచ్చగొడుతోంది పోలీసులా? పవన్ కళ్యాణా? లేక నేతలా? | SCS silent protest permission denied.

No permission for scs meetings

Special Category Status, SCS meeting, RK beach Silent Protest, SCS RK Beach, SCS meeting, Pawan kalyan, DGP Sambasiva Rao, Pawan Kalyan Sambasiva Rao, No permission for SCS, Pawan Kalyan Politics, Pawan Kalyan Tweets, Pawan Kalyan Special Status, Pawan Kalyan Janasena, Pawan kalyan Desh Bachao

Even as more political parties and organisations extended support to rallies demanding Special Category Status in Visakhapatnam and other places, Director General of Police N. Sambasiva Rao made it clear on Tuesday that there was no permission to hold such meetings as these were based on social media posts not owned up by any person or organisation. Later Pawan kalyan tweeted on those comments. If they don't allow it now; you are creating unrest in them. Peaceful protest is their right.

ఆర్కేబీచ్ నిరసన... రెచ్చగొడుతోంది ఎవరు?

Posted: 01/25/2017 08:31 AM IST
No permission for scs meetings

గణతంత్ర్య దినోత్సవం రోజుల తమ హక్కుల సాధనకై తమిళ తంబీల తరహాలో వైజాగ్ ఆర్కే బీచ్ లో మౌన ప్రదర్శన నిర్వహించాలని యావత్ ఆంధ్రా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే అందుకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని చెబుతూ పోలీస్ బాస్ సాంబశివరావు నిన్న మీడియాలో క్లారిటీగా చెప్పిన విషయం కూడా చూశాం. సోషల్ మీడియా ద్వారా ఇచ్చే పిలుపులకి విలువ ఉండదన్న ఆయన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు కూడా.

వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో నిరసన జరుగుతుంది, రండి అని పిలుపునిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలా ఎవరు పడితే వాళ్లు పిలుపునిస్తే శాంతి భద్రతలు ఎవరు పరిరక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?. చెన్నై అల్లర్లు కూడా ముందు శాంతియుతంగానే సాగింది. నిరసన కార్యక్రమానికి అనుమతి కావాలంటూ ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు అనుమతి అడిగినా బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టమని చెప్పాడు. ఆర్కే బీచ్ లో నిరసనకు అనుమతి లేదని ఆయన తెలిపారు. రిపబ్లిక్ డే, పైగా శాంతి భద్రతల సమస్య ఎదురైతే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశాడు.

ఇక విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ లో ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయమై ‘మౌన నిరసన’ కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ఇచ్చిన విషయంత తెలిసిందే. గత మూడు రోజులుగా ట్విట్టర్ వేదికగా పిలుపు ఇస్తున్న పవన్, దేశ్ బచావో పేరిట ఆల్బం ను విడుదల చేయటం, హక్కుల కాలరాయాలని చూస్తే మెడలు వంచుతాం అంటూ కేంద్రాన్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించాడు.

నిరసన దీక్షకు అనుమతించకపోతే విద్యార్థుల్లో అశాంతి రగిలే అవకాశముందని, శాంతియుతంగా నిరసన తెలియజేయడం యువత హక్కు అని పవన్ పేర్కొన్నారు. విశాఖలో యువత నిరసన దీక్షకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, ఈ నిరసన దీక్ష రాజకీయాలకు అతీతమైందని, హామీల ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేయడం దేశ పౌరులుగా వారి హక్కు అని పవన్ పేర్కొన్నాడు.

అంతేకాదు అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. మోదీని వెళ్లి కలిసి మాట్లాడమంటున్నారు. ప్రచార సమయంలో వేదిక మీద ఆయనతోపాటు ఎంపీలంతా ఉన్నారు. ఇప్పుడు మీరంతా పార్లమెంట్ లో ఆయన పక్కనే కూర్చుంటున్నారు కదా. మీరేం చేస్తున్నారు. అంటూ మరో ట్వీట్ చేశాడు. అసలు ఇస్తారో, ఇవ్వరో చెప్పుకుండా ప్రజల అసంతృప్తిని తెలియజేయకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మీరు ఏం చేయకండి. యువతను ఏం చేయనీయకండి. ఇక సమస్యకు పరిష్కారం ఎలా అంటూ మరో పోస్ట్ పెట్టాడు.

 

మొత్తానికి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతోనే పోలీసులు ఈ ఆందోళనను అడ్డుకోవాలని చూస్తున్నట్లు క్లియర్ గా స్పష్టమౌతోంది. పరిణామాలను ప్రజలు, నేతలు నిశితంగా గమనిస్తున్నారు. మరి వైజాగ్ నిరసన విజయవంతంగా సాగుతుందా? లేక చెన్నై లా చిచ్చు రేగుతుందా? అలా జరగకూడదనే కోరుకుందాం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  DGP Sambasiva Rao  SCS Meeting  RK Beach  

Other Articles